ఇంద్ర... ఇంద్రసేనారెడ్డి గుర్తొచ్చాడు –చిరంజీవి | chiranjeevi praises to Vijay Anthony | Sakshi
Sakshi News home page

ఇంద్ర... ఇంద్రసేనారెడ్డి గుర్తొచ్చాడు –చిరంజీవి

Sep 6 2017 12:23 AM | Updated on Jul 25 2018 3:25 PM

ఇంద్ర... ఇంద్రసేనారెడ్డి గుర్తొచ్చాడు –చిరంజీవి - Sakshi

ఇంద్ర... ఇంద్రసేనారెడ్డి గుర్తొచ్చాడు –చిరంజీవి

‘‘టైటిల్‌ వినగానే ఇంప్రెస్సివ్‌గా అనిపించడమే కాదు. నాకు నా సినిమా ‘ఇంద్ర’, అం

‘‘టైటిల్‌ వినగానే ఇంప్రెస్సివ్‌గా అనిపించడమే కాదు. నాకు నా సినిమా ‘ఇంద్ర’, అందులోని ‘ఇంద్ర.. ఇంద్రసేనారెడ్డి’ డైలాగ్‌ గుర్తొచ్చింది. స్టోరీ లైన్‌ విన్నా. ఇదొక యాక్షన్, సెంటిమెంట్‌ సినిమా. ప్రయోగమని చెప్పలేం. అలాగని, సగటు సినిమాల్లానూ ఉండదు. కొత్తగా, వెరైటీగా ఉంటుంది. ఇందులో కమర్షియల్‌ హంగులన్నీ ఉన్నాయి. ‘బిచ్చగాడు’తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన విజయ్‌ ఆంటోని, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నా స్నేహితురాలు రాధిక పెద్ద విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నా’’ అన్నారు చిరంజీవి. విజయ్‌ ఆంటోని నటిస్తున్న తెలుగు–తమిళ సినిమా ‘ఇంద్రసేన’. తమిళంలో ‘అన్నాదురై’గా రూపొందుతోంది. జి. శ్రీనివాసన్‌ దర్శకత్వంలో రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్‌ ఆంటోని నిర్మిస్తున్న ఈ సిన్మా ఫస్ట్‌ లుక్‌ను చిరంజీవి ఆవిష్కరించారు.

రాధిక మాట్లాడుతూ– ‘‘ఇంద్ర’ వంటి బ్లాక్‌బస్టర్‌ను ఇండస్ట్రీకి ఇచ్చిన చిరంజీవిగారితోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేయించాలని మా హీరో విజయ్‌ ఆంటోని పట్టుబట్టారు. ఇదొక ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. నవంబర్‌లో విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మెగాస్టార్‌గారి చేతుల మీదుగా ఫస్ట్‌లుక్‌ విడుదలవడం హ్యాపీగా ఉంది. రాధికగారు మాకు, మా సినిమాకు పెద్ద అండ’’ అన్నారు విజయ్‌ ఆంటోని. చిత్రదర్శకుడు జి. శ్రీనివాసన్, హీరోయిన్లు డైనా చంపిక, మహిమా, రచయిత భాష్య శ్రీ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement