విడిపోతున్న మరో హలీవుడ్‌ జంట | Channing Tatum And Wife Jenna Dewan "Lovingly Separate" | Sakshi
Sakshi News home page

విడిపోతున్న మరో హలీవుడ్‌ జంట

Apr 3 2018 11:40 AM | Updated on Jul 10 2019 7:55 PM

Channing Tatum And Wife Jenna Dewan "Lovingly Separate" - Sakshi

హాలీవుడ్‌ జంట చానింగ్‌ టాటమ్‌, డెవాన్‌

లాస్‌ ఏంజెల్స్‌ : మరో హాలీవుడ్‌ జంట విడిపోతోంది. వైట్‌ హౌస్‌ డౌన్‌, స్టెప్‌ అప్‌ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్ననటుడు చాన్నింగ్‌ మాథ్యూ టాటమ్‌, ఆయన భార్య జెన్నాతో 9 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకుంటున్నట్లు ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా తెలిపారు. టాటమ్‌, జెన్నా డెవాన్‌లు ‘స్టెప్‌ అప్‌’ మూవీ నిర్మాణ సమయంలో ప్రేమలో పడ్డారు. మూడేళ్లు ప్రేమాయణం సాగిన తర్వాత పెళ్లి చేసుకున్నారు.

వీరికి నాలుగేళ్ల కుమార్తె ఎవర్లీ ఉంది. తాము చాలా ఏళ్లుగా గాఢమైన ప్రేమలో ఉన్నామని, అలాగే మ్యాజికల్‌ జర్నీని కొనసాగించామని తెలిపారు. ప్రేమ ఒక సాహస కృత్యం లాంటిదని, అది మమ్మల్ని భిన్న మార్గాల్లో తీసుకెళ్తున్నదని పేర్కొన్నారు.

బ్రేకప్‌ విషయంలో ఎలాంటి దాపరికాలు లేవని, విడిపోయినా తాము మంచి స్నేహితులుగా ఉన్నామని, తమ కూతురు ఎవర్లీకి మంచి తల్లిదండ్రులుగా మెలుగుతామని ట్విటర్‌లో వివరించారు. తమ ప్రైవసీని గౌరవించినందుకు గానూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement