సీబీఎఫ్‌సీ కార్యాలయాలు మూసివేత

Central Board of Film Certification officess is closed due to corona virus - Sakshi

కోవిడ్‌ 19 (కరోనావైరస్‌) ప్రభావంతో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్  గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్  ప్రసూన్  జోషి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన సారాంశం ఇలా.... ‘‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్  (సీబీఎఫ్‌సీ)కు సంబంధించిన మా క్లయింట్స్, ప్యానెల్‌ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, మిగతా సిబ్బంది ఆరోగ్యాలను  దృష్టిలో ఉంచుకుని దేశంలోని తొమ్మిది సీబీఎఫ్‌సీ కార్యాలయాలను మూసివేస్తున్నాం. ఈ కార్యాలయాల్లో ఇకపై సినిమాలు స్క్రీనింగ్‌ కావు.

కరోనా ప్రభావం తగ్గగానే తిరిగి మా సేవలను ప్రారంభిస్తాం. సందేహాలకోసం ఆయా కార్యాలయాల్లో హెల్ప్‌లైన్  నెంబర్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొందరు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయనున్నారు. తద్వారా ఆన్ లైన్  అప్లికేషన్స్‌, ఫిల్మ్‌ అప్లికేషన్స్‌ వంటి వాటిని పరిశీలించే ప్రయత్నం చేస్తాం. మనందరి సమిష్టి పోరాటంతో ఈ విపత్కర పరిస్థితుల నుంచి త్వరలోనే బయట పడతామనే నమ్మకం నాకు ఉంది’’ అని జోషి పేర్కొన్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్‌లు బంద్‌ అయిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top