స్పీడున్నోడితో స్పెషల్ సాంగ్లో..! | Catherine tresa Special song in Boyapati Srinu, Bellamkonda Sai Srinivas film | Sakshi
Sakshi News home page

స్పీడున్నోడితో స్పెషల్ సాంగ్లో..!

Mar 16 2017 1:04 PM | Updated on Aug 3 2019 12:45 PM

స్పీడున్నోడితో స్పెషల్ సాంగ్లో..! - Sakshi

స్పీడున్నోడితో స్పెషల్ సాంగ్లో..!

అల్లుడు శీను సినిమాతో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా.

అల్లుడు శీను సినిమాతో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. ఆ తరువాత చేసిన స్పీడున్నోడు కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో కాస్త గ్యాప్ తీసుకొని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో ప్రయత్నం చేస్తున్నాడు. తొలి రెండు సినిమాల్లో తమన్నాతో స్పెషల్ సాంగ్స్లో ఆడి పాడిన సాయి శ్రీనివాస్, నెక్ట్స్ సినిమా కోసం మరో బ్యూటీ క్వీన్ను రంగంలోకి దించుతున్నాడు.

ఇద్దరమ్మాయిలతో., సరైనోడు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న కేథరిన్ థెరిస్సా, బోయపాటి సినిమా కోసం సాయి శ్రీనివాస్తో ఆడిపాడనుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన సెట్లో సాయి, కేథరిన్ల మీద పాటను చిత్రీకరిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement