'కత్తి' హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్లపై పరువునష్టం దావా! | Case filed against actor, director, producer of 'Kaththi' | Sakshi
Sakshi News home page

'కత్తి' హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్లపై పరువునష్టం దావా!

Oct 28 2014 8:54 PM | Updated on Sep 2 2017 3:30 PM

విజయ్, మురుగదాస్

విజయ్, మురుగదాస్

వివాదాల నడుమ ఇటీవల విడుదలై తమిళనాడులో ఘన విజయం సాధించిన 'కత్తి' చిత్రం ఇప్పుడు మరో సమస్యలో చిక్కుకుంది.

మదురై: వివాదాల నడుమ ఇటీవల విడుదలై తమిళనాడులో ఘన విజయం సాధించిన 'కత్తి' చిత్రం ఇప్పుడు మరో సమస్యలో చిక్కుకుంది. ఈ సినిమా హీరో విజయ్‌తోపాటు దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌పై స్థానిక కోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది. ఈ సినిమాలో కోర్టులో విచారణ జరుగుతున్న 2జీ స్పెక్ట్రమ్ కేసును ప్రస్తావించినందుకు ఈ కేసు దాఖలైంది.  ఈ కేసుపై ఓవైపు ఢిల్లీ కోర్టులో విచారణ జరుగుతుండగా,  ఈ వ్యవహారంలో అవినీతి జరిగినట్లుగా  నిర్ధారిస్తూ  ఈ సినిమాలో  ఓ డైలాగ్‌ను పెట్టారు.

ఐపీసీ సెక్షన్ 500 (పరువుకు నష్టం కలిగించడం) కింద ఈ వ్యాఖ్య చేయడం నేరమని ఆర్. రామసుబ్రమణియన్ అనే న్యాయవాది మదురైలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశారు. ఇటువంటి డైలాగ్‌లు దేశానికి రావాల్సిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)పై ప్రభావం చూపుతాయన్నది ఆయన వాదన. కేసును విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను నవంబర్ 11కు వాయిదా వేసింది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement