'సౌత్' పాట అందుకున్న హీరోయిన్ | Bollywood not my priority now, says Tamannaah Bhatia | Sakshi
Sakshi News home page

'సౌత్' పాట అందుకున్న హీరోయిన్

Jun 21 2015 1:44 PM | Updated on Apr 3 2019 6:23 PM

'సౌత్' పాట అందుకున్న హీరోయిన్ - Sakshi

'సౌత్' పాట అందుకున్న హీరోయిన్

బాలీవుడ్ లో అదృష్టం కలిసిరాకపోవడంతో 'మిల్కీ బ్యూటీ' తమన్నా మళ్లీ 'సౌత్' పాట అందుకుంది.

న్యూఢిల్లీ: బాలీవుడ్ లో అదృష్టం కలిసిరాకపోవడంతో 'మిల్కీ బ్యూటీ' తమన్నా మళ్లీ 'సౌత్' పాట అందుకుంది. గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నానని ఇక నుంచి దక్షిణాదిపైనే దృష్టి పెడతానని వెల్లడించింది. సౌత్ లో అగ్ర తారగా కొనసాగిన తమన్నా బాలీవుడ్ లో నటించిన హిమ్మత్ వాలా, హమ్ షాకాల్స్  సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో ఆమె మళ్లీ దక్షిణాది సినిమాలపై దృష్టి సారించింది. ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి'లో ఆమె కీలకపాత్ర  పోషించింది. ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు.

తన చేతిలో ఉన్న తెలుగు, తమిళ సినిమాలతో సంతోషంగా ఉన్నానని తమన్నా తెలిపింది. ఇకపై బాలీవుడ్ కు ప్రాధాన్యత ఇవ్వబోనని స్పష్టం చేసింది. 'బాహుబలి'లో తన పాత్రను కరణ్ జోహార్ ఎంతో మెచ్చుకున్నారని పొంగిపోయింది. జూలై 10న విడుదలకానున్న 'బాహుబలి' విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement