నా మీద నాకే జాలేసింది : హీరో | Bobby Deol Says I Started Pitying Myself | Sakshi
Sakshi News home page

Jun 3 2018 4:15 PM | Updated on Jun 3 2018 6:00 PM

Bobby Deol Says I Started Pitying Myself - Sakshi

లాంగ్‌ గ్యాప్ తరువాత పోస్టర్‌ బాయ్స్‌ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో బాబీ డియోల్‌ త్వరలో రేస్‌ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సల్మాన్‌ కారణంగానే తనకు ఈ అవకాశం వచ్చిందని చెపుతున్న బాబీ డియోల్‌, తనకు అవకావాలు లేని సమయంలో అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ‘నా గురించి నేను పట్టించుకోవటం మానేశాను. నటుడిగా మేం బాడీని మెయిన్‌టైన్‌ చేయాల్సి ఉంటుంది. కానీ నేను నెమ్మదిగా అన్ని కోల్పోతూ వచ్చాను. నా మీద నాకే జాలేసి, రోజూ తాగేవాడిని’ అన్నారు.

సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్ సమయంలో సల్మాన్‌ తనకు ధైర్యం చెప్పాడని.. తరువాత కాల్‌ చేసి ఈ అవకాశం ఇచ్చారని తెలిపాడు. ‘ఇప్పుడు నా మీద నాకు నమ్మకం కలిగింది. ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నా. ఇప్పుడు ఒక రోజు కూడా ఖాలీగా ఇంట్లో కూర్చోవాలని లేదన్నా’రు బాబీ డియోల్‌. రేస్‌ 3 తరువాత హౌస్‌ ఫుల్‌ 4తో పాటు అన్న సన్నిడియోల్‌, తండ్రి ధర్మేంద్రలతో కలిసి యమ్లా పగ్లా దీవానా ఫిసే సినిమాలలో నటించేందుకు రెడీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement