మొదటిరోజే హౌస్‌మేట్స్‌కు షాక్‌ ఇవ్వనున్న బిగ్‌బాస్‌

Bigg Boss 3 Telugu Started And Nagarajuna As Host - Sakshi

విదేశాల్లో పుట్టిన బిగ్‌ బ్రదర్‌ షోకు అనుకరణగా ఇండియాలో బిగ్‌బాస్‌ షో ప్రారంభమైంది. మొదటగా హిందీ, బెంగాలీలో మొదలైన ఈ షో.. క్రమక్రమంగా దక్షిణాదిన పాగా వేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో బిగ్‌బాస్‌కు ఫుల్‌ క్రేజ్‌ ఏర్పడింది. కన్నడలో ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌.. తమిళంలో మూడో సీజన్‌ విజయవంతంగా రన్‌ అవుతోంది. లోక నాయకుడు కమల్‌ హాసన్‌ గత రెండు సీజన్లను సక్సెస్‌ చేయగా.. మూడో సీజన్‌ను కూడా ఫుల్‌ స్వింగ్‌లో హోస్ట్‌ చేస్తున్నాడు. మనవరకు వస్తే.. బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్‌ సక్సెస్‌ఫుల్‌గా నడిపించగా.. రెండో సీజన్‌ను ముందుకు తీసుకెళ్లడంలో నాని కాస్త తడబడ్డాడు. ఇక ఈ మూడో సీజన్‌ను గాడిలో పెట్టేందుకు నాగ్‌ సిద్దమయ్యాడు.

తెలుగు నాట అత్యంత ప్రజాధరణ పొందిన రియాల్టీ షోగా ప్రఖ్యాతి గాంచిన బిగ్‌బాస్‌ షో మూడో సీజన్‌ ఆదివారం ప్రారంభమైంది. టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తొమ్మిది గంటలకు మొదలైన ఈ షోలో తారాజువ్వల వెలుగులో గ్రాండీయర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తన సినిమాలలోని పాటలకే సందడిగా డ్యాన్సులు చేశాడు. లివింగ్‌ ఏరియాలో కూర్చొని.. దాని గురించి వివరిస్తూ.. పండుతో ముచ్చటించాడు.

అటుపై ఇక బుల్లితెర వీక్షకులకు బిగ్‌బాస్‌ హౌస్‌ గురించి వివరిస్తూ..బెడ్‌రూమ్‌ ఏరియాను చూపిస్తూ ఉండగా.. బిగ్‌బాస్‌ ఆదేశాల మేరకు కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లాడు నాగ్‌. అక్కడికి వెళ్లిన నాగ్‌కు బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇచ్చాడు. కంటెస్టెంట్లలో ఉన్న ముగ్గురుని నాగ్‌ సెలెక్ట్‌ చేసి వెల్‌కమ్‌ చెప్పాల్సిందిగా టాస్క్‌ ఇచ్చాడు. లక్కీ డిప్‌ ద్వారా వచ్చిన ఎల్లో కార్డ్‌తో..మొదటి కంటెస్టెంట్‌గా తీన్మార్‌ సావిత్రి ఎంట్రీ ఇచ్చింది. 

సావిత్రి
తెలంగాణలో తీన్మార్‌ వార్తలు ఎంత ఫేమస్‌ అయిందో.. సావిత్రి(శివ జ్యోతి) కూడా అంతే ఫేమస్‌ అయింది. సావిత్రక్కగా వీక్షకుల్లో అభిమానం సంపాదించుకున్న ఈమె బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే గత కొంతకాలం నుంచి తీన్మార్‌ వార్తల్లో రాకుండా.. సోషల్‌ మీడియాపై ఫోకస్‌ పెట్టారు. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నందుకే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. తన అభిమాన గణాన్ని పెంచుకునేందుకు ఫేస్‌బుక్‌లో నిత్యం టచ్‌లో ఉన్నారు. వార్తలు చదువుతూ, సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసే సావిత్రి.. తెలంగాణ యాసలో ఆకట్టుకోవడం ప్రధాన బలం. మరి సావిత్రి బిగ్‌బాస్‌ హౌస్‌లో కూడా తోటి కంటెస్టెంట్ల అభిమానంతో పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ.. చివరి వరకు నిలిచి విన్నర్‌గా నిలుస్తుందా? అన్నది చూడాలి.

రెండో లక్కీ డిప్‌లో రెడ్‌ కార్డ్‌తో సీరియల్‌ ఆర్టిస్ట్‌ రవికృష్ణ ఎంట్రీ ఇవ్వగా.. మూడో కంటెస్టెంట్‌గా పింక్‌ కార్డ్‌తో డబ్‌ స్మాష్‌ స్టార్‌ అషూ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. వచ్చీరావడంతోనే ముగ్గురికి బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ ఇచ్చాడు. ఇకపై హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేవారిని  ప్రశ్నలను అడగాలని, ప్రశ్నలతో పాటు ఆప్షన్స్‌ కూడా ఇచ్చి.. వారిచ్చే సమాధానాలతో వారిని ఓ అంచనా వేయమని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఈ విషయం ఆ ముగ్గురి మధ్యే ఉండాలని సూచించాడు. 

రవికృష్ణ
గ్రాండ్‌గా ప్రారంభించిన బిగ్‌బాస్‌ షోలో రెండో పార్టిసిపెంట్‌గా సీరియల్‌ నటుడు రవికృష్ణ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కో క్యాటగిరీ నుంచి ఒక్కో సెలబ్రెటీని ఎంచుకునే బిగ్‌బాస్‌ టీమ్‌ ఈసారి సీరియల్‌లో నటించే వారికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు కనబడుతోంది.  గత కొంతకాలం నుంచి సీరియల్‌లో హీరో క్యారెక్టర్‌కు రవికృష్ణ కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు. మరి బిగ్‌బాస్‌ హౌస్‌లో హీరోగా మారి చివరి వరకు నిలబడి టైటిల్‌ గెలుచుకుంటాడా? అన్నది చూడాలి.

అషూ రెడ్డి
బిగ్‌బాస్‌ ఇంట్లోకి మూడో హౌస్‌మేట్‌గా అషూ రెడ్డి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది డబ్‌ స్మాష్‌ క్యాటగిరీలో దీప్తి సునయన హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఈసారి అషూ రెడ్డి(జూనియర్‌ సమంత) ఎంట్రీ ఇచ్చింది. డబ్‌స్మాష్‌ వీడియోలతో సోషల్‌ మీడియాలో ఫుల్‌ క్రేజ్‌ను సొంతం చేసుకున్న అషూ రెడ్డి.. బిగ్‌బాస్‌లో కూడా ఎంటర్‌టైన్‌ చేస్తూ చివరి వరకు నిలబడుతుందా? అన్నది చూడాలి.

జాఫర్‌
నాల్గో కంటెస్టెంట్‌గా ప్రముఖ యాంకర్‌ జాఫర్‌ ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ వార్తా చానెల్‌ యాంకర్‌, హోస్ట్‌గా ప్రఖ్యాతి గాంచిన జాఫర్‌.. బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చాడు. ఈయన సెలబ్రెటీలను అడిగే ప్రశ్నలు, ఇంటర్వ్యూ చేసే విధానం లాంటివి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ఈయన గొంతును, యాంకరింగ్‌ను చాలామంది అనుకరిస్తుంటారు. సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉన్న అతికొద్దిమంది పాత్రికేయుల్లో జాఫర్‌ ఒకరు. మరి ఈయన బిగ్‌బాస్‌ హౌస్‌లో కూడా ఎంటర్‌టైన్‌ చేస్తూ చివరి వరకు పోరాడతారా? అన్నది చూడాలి.

హిమజ
ఐదో కంటెస్టెంట్‌గా హిమజ ఎంట్రీ ఇచ్చారు. సీరియల్స్‌తో పాటు సినిమాల్లో నటిస్తు మంచి గుర్తింపును తెచ్చుకున్న హిమజ.. బిగ్‌బాస్‌ షోతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. స్పైడర్‌, మహానుభావుడు, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హిమజ.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇతర కంటెస్టెంట్లకు ఏవిధమైన పోటీ ఇస్తారో? చూడాలి.

రాహుల్‌ సిప్లిగంజ్‌
ఆరో కంటెస్టెంట్‌గా ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే.. మిగతా కంటెస్టెంట్లను తన పాటలతో అలరించాడు. ప్రతీ సీజన్‌లో ఓ సింగర్‌ ఉండేట్లు చూసుకుంటున్న బిగ్‌బాస్‌ నిర్వాహకులు.. ఈసారి రాహుల్‌ సిప్లిగంజ్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం రైజింగ్‌ స్టార్‌గా ఎదుగుతున్న రాహుల్‌.. ప్రైవేట్‌ ఆల్బమ్స్‌తో ట్రెండింగ్‌లో ఉంటాడు. గత సీజన్‌లో మాధిరి కల్పనా, గీతామాధురిల జాబితాలో రాహుల్‌ చేరి.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంటర్‌టైన్‌ చేస్తారా? అనేది చూడాలి.

రోహిణి
ఏడో కంటెస్టెంట్‌గా ప్రముఖ నటి రోహిణి ఎంట్రీ ఇచ్చారు. రాయలసీమ యాసలో ప్రత్యేకమైన డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకునే రోహిణి.. బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయనుంది. మరి రోహిణి కడవరకు నిలబడుతుందా? అన్నది చూడాలి.

బాబా భాస్కర్‌
ఎనిమిదో కంటెస్టెంట్‌గా బాబా భాస్కర్‌ ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూనే.. ఇంటి సభ్యులతో సందడి చేశారు. మిగతా కంటెస్టెంట్లకు సంధించిన ప్రశ్నలనే బాబా బాస్కర్‌కూ సంధించారు. కొరియోగ్రాఫర్స్‌లో బాబా భాస్కర్‌ శైలి వేరన్న సంగతి తెలిసిందే. సెట్లో ఈయన చేసే అల్లరి గురించి, బుల్లితెరపై వచ్చే కార్యక్రమాల్లో ఈయన చేసే సందడిని చూసే ఉంటారు. మగధీర చిత్రంలోన పంచదార బొమ్మా అనే పాట తన లైఫ్‌కు టర్నింగ్‌పాయింట్‌ అని చెప్పుకునే ఈ కొరియోగ్రాఫర్‌కు.. బిగ్‌బాస్‌ కూడా మరో టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందా? అన్నది చూడాలి.

పునర్నవి భూపాలం
బిగ్‌బాస్‌ ఇంట్లోకి తొమ్మిదో కంటెస్టెంట్‌గా ఉయ్యాల జంపాల ఫేమ్‌ పునర్నవి భూపాలం ఎంట్రీ ఇచ్చింది. ఉయ్యాల జంపాల చిత్రంలో జండూభామ్‌(సునీత)గా ప్రేక్షకులను అలరించి.. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు సినిమాలో శర్వానంద్‌ కూతురు పార్వతి పాత్రలో ఆకట్టుకుంది పునర్నవి భూపాలం. చిన్న చిన్న పాత్రలను చేస్తూ.. క్రేజ్‌ను సంపాదించుకుంటోన్న పునర్నవి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.  వందరోజుల పాటు సాగే ఈ షోలో ఆడియన్స్‌ను ఆకట్టుకుని, ఎలిమినేషన్స్‌ను తప్పించుకుని చివరి వరకు కొనసాగుతుందా?

హేమ
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పదో పార్టిసిపెంట్‌గా ప్రముఖ నటి హేమ ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న నటి హేమ. కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకునే హేమ.. మా(మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) ఎన్నికల్లో వివాదాస్పదమవుతూ ఫైర్‌ బ్రాండ్‌గా ముద్ర వేసుకున్నారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనస్తత్వం ఉన్న హేమ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. నిక్కచ్చిగా ఉండే హేమ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏమేరకు రాణిస్తుందో చూడాలి.

అలీ రెజా
బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పదకొండో కంటెస్టెంట్‌గా ప్రముఖ నటుడు అలీ రెజా ఎంట్రీ ఇచ్చాడు. ఇంట్లోకి వస్తూనే అందర్నీ పలకరించి.. ఫుల్‌ యాక్టివ్‌ మోడ్‌లో ఉన్నాడు అలీ రెజా. సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తూ వచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నాడు అలీ రెజా. ధృవ సినిమాలో రామ్‌ చరణ్‌ స్నేహితుడిగా పోలీస్‌ పాత్రలో నటించాడు. మరి బిగ్‌బాస్‌లో వీక్షకులను ఎంటర్‌టైన్‌ చేసి.. క్రేజ్‌ను సంపాదించుకుని స్టార్‌గా ఎదుగుతాడా? అన్నది చూడాలి.

మహేష్‌ విట్టా
పన్నెండో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మహేష్‌ విట్టా ఎంట్రీ ఇచ్చాడు. యూట్యూబ్‌లో స్టార్‌ కమెడియన్‌గా ఫేమస్‌ అయిన మహేష్‌ విట్టా.. సినిమాల్లోనూ నటించి మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నారు. హీరోగా ఫ్రెండ్‌ పాత్రల్లో నటిస్తూ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. మరి ఇదే విధంగా బిగ్‌బాస్‌ ఇంట్లో కూడా నవ్వులు పూయించి హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియన్స్‌ను కూడా ఎంటర్‌టైన్‌ చేసి.. విన్నర్‌గా నిలుస్తాడా?

శ్రీముఖి
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి శ్రీముఖి పదమూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. డ్యాన్సులతో అదరగొడుతూ స్టేజ్‌పై దుమ్ముదులిపింది. ఇక తనకు కలిసి వచ్చిన రాములమ్మ స్టెప్పులతో హల్‌చల్‌ చేసింది. ఇంట్లోకి ప్రవేశిస్తూనే.. ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చుట్టూ పరిసరాలను గమనిస్తూ లివింగ్‌ ఏరియాలో ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌మేట్స్‌ను పలకరించిన అనంతరం.. వారు సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

పటాస్‌ షోతో బుల్లితెరను ఓ ఊపు ఊపిన శ్రీముఖి.. యాంకర్‌ రవితో పాటు పటాస్‌ షో చేసిన అనతి కాలంలోనే స్టార్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. రాములమ్మ స్టెప్పులతో తన ఐడెంటీని క్రియేట్‌ చేసుకున్న శ్రీముఖి.. వెండితెరకూ సుపరిచితురాలే. అడపదడపాగా నటిస్తూ ఉన్నా.. బుల్లితెరపై హోస్ట్‌గానే ఎక్కువ నేమ్‌,ఫేమ్‌ సొంతం చేసుకుంది. అయితే బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నందున గతకొంతకాలం నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ షోలకు విరామం ఇచ్చి.. ఫిట్‌నెస్‌పై పూర్తిగా దృష్టిపెట్టారు. హాట్‌ ఫోటోషూట్‌లతో అభిమానులను అలరిస్తూ సోషల్‌ మీడియాలో హడావిడి చేస్తోంది. హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వకముందే తన సైన్యాన్ని సిద్దం చేసుకుని.. కడవరకు నిలిచేందుకు, మిగతా హౌస్‌మేట్స్‌కు గట్టి పోటి ఇచ్చేందుకు రెడీ అయింది.

వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు
బిగ్‌బాస్‌లోకి ఇంతవరకు ఓ జంట వెళ్లింది లేదు. అయితే అందులోకి వెళ్లాక జంటలు ఏర్పడటం మామూలే. అయితే ఈ సారి ఓ జంట మాత్రం హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో ఒకప్పుడు ఫుల్‌ క్రేజ్‌ను సొంతం చేసుకున్న వరుణ్‌ సందేశ్‌, ఆయన సతీమణి వితికా షెరు హౌస్‌లోకి ప్రవేశించారు. మరి ఇద్దరు భార్యభర్తలు హౌస్‌లో ఎలా ఉంటారు? టాస్క్‌లు ఇచ్చినప్పుడు ఒకరిపై ఒకరు గెలవాలనుకుంటారా? లేదా ఒకరికోసం మరొకరు వదులుకుంటారా? అన్నది చూడాలి.

సోషల్‌ మీడియాలో లీకైన లిస్టే.. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకుల్లో అంతగా ఉత్కంఠ కనపడలేదు. ఈ పదిహేను మంది పేర్లు శనివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. వారే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. స్టార్‌ మా బృందం కడవరకు సస్పెన్స్‌ మెయింటెన్‌ చేసినా కూడా లీకులు మాత్రం ఆగలేదు. గత సీజన్‌లో కంటెస్టెంట్‌ అయిన నూతన్‌ నాయుడు సోషల్‌ మీడియాలో వదిలిన లిస్టే నిజమైంది. తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌ సృష్టించిన బిగ్‌బాస్‌ ఎట్టకేలకు మొదలైంది. వంద రోజుల పాటు పదిహేను మందితో సాగే ఈ షో.. రేపటి నుంచి కంటెస్టెంట్ల గొడవలు, ప్రేమలు, కోపాలు, అలకలతో రక్తికట్టించబోతోంది. తొలిరోజే కొంతమంది హౌస్‌మేట్స్‌ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ తెలిపాడు. అయితే వారు కెప్టెన్‌ టాస్క్‌కు ఎంపికైన వారా? లేదా మొదటి వారానికి గానూ ఎలిమినేషన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వారా? అన్నది తెలియాలంటే సోమవారం ప్రసారమయ్యే కార్యక్రమం వీక్షించాల్సిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వార్తలు

18-10-2019
Oct 18, 2019, 17:42 IST
తెలుగు బిగ్‌బాస్‌ 3 సీజన్‌ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. పదమూడో వారానికి గానూ ఏడుగురు నామినేట్‌ అవగా ఎవరో ఒకరు లగేజీ సర్దుకోవాల్సిన సమయం...
18-10-2019
Oct 18, 2019, 12:59 IST
బిగ్‌బాస్‌ తెలుగు 3 సీజన్‌ చూస్తుండగానే ముగింపు దశకు వచ్చేసింది. బిగ్‌బాస్‌ ఇంట్లో టైటిల్‌ వేటకు ఇంకా 13 రోజులు...
18-10-2019
Oct 18, 2019, 11:06 IST
బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చిన అతిథులతో హౌస్‌ సందడిగా మారింది. గత ఎపిసోడ్‌లో ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌ నానమ్మ రాజ్యలక్ష్మి గలగలా మాట్లాడుతూ,...
17-10-2019
Oct 17, 2019, 12:31 IST
బిగ్‌బాస్‌ పదమూడోవారం ఎమోషనల్‌ జర్నీగా మారుతోంది. ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు హౌస్‌మేట్స్‌ మిగిలారు. వీరు టీవీ, ఫోన్‌లను వదిలేసి, బయట ప్రపంచానికి దూరంగా ఉంటూ 85...
17-10-2019
Oct 17, 2019, 11:05 IST
బిగ్‌బాస్‌ ఇంట్లో గ్రూప్‌లు మారిపోయినట్టు కొట్టొచినట్టు కనిపిస్తోంది. రాహుల్‌.. శివజ్యోతి, అలీ రెజా ఒక గ్రూప్‌... శ్రీముఖి, బాబా భాస్కర్‌, వరుణ్‌, వితిక...
16-10-2019
Oct 16, 2019, 17:04 IST
బిగ్‌బాస్‌ షోలో అందంతో అదరగొడుతూ.. అల్లరితో అలరిస్తున్న ఏకైక వ్యక్తి శ్రీముఖి. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి టాప్‌ 3లో ఉంటుందనడంలో...
16-10-2019
Oct 16, 2019, 12:25 IST
బిగ్‌బాస్‌ ఇచ్చిన ఫన్నీ టాస్క్‌ ఎమోషనల్‌గా మారుతోంది. బిగ్‌బాస్‌ హోటల్‌ నిర్వహణ ఆధారంగానే ఇంట్లోకి అతిథులను పంపిస్తానని బిగ్‌బాస్‌ తేల్చి చెప్పాడు. అయితే...
16-10-2019
Oct 16, 2019, 10:55 IST
బిగ్‌బాస్‌ ఇంట్లో నామినేషన్‌ చిచ్చు చల్లారలేదు. మాటల యుద్ధానికి దిగిన కంటెస్టెంట్లు ఇంకా దాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ‘నన్ను కంత్రి...
15-10-2019
Oct 15, 2019, 21:13 IST
‘టాపర్‌ ఆఫ్‌ ద హౌస్‌’ టాస్క్‌పెట్టి..  మీలో మీరే ఎవరు తోపు అనేది తేల్చుకోండి అంటూ బిగ్‌బాస్‌ ఆదేశించాడు. మొదటి మూడు...
15-10-2019
Oct 15, 2019, 17:56 IST
బిగ్‌బాస్‌ ఇంట్లో మహేశ్‌కు, శ్రీముఖికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదన్న విషయం అందరికీ తెలిసిందే! పన్నెండో వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన ‘హంట్‌ అండ్‌ హిట్‌’...
15-10-2019
Oct 15, 2019, 17:17 IST
హౌస్‌లో గొడవలు రాజుకున్నాయనుకునేలోపే ఏదైనా ఫన్నీ టాస్క్‌ ఇచ్చి ఇంటి సభ్యులను కూల్‌ చేస్తాడు బిగ్‌బాస్‌. అందరూ కుటుంబంలాగా కలిసిపోయారనుకునేలోపే...
15-10-2019
Oct 15, 2019, 15:30 IST
బిగ్‌బాస్‌ ఇంట్లో పన్నెండోవారం ముగిసింది. మహేశ్‌ విట్టా ఎలిమినేట్‌ అవటంతో ప్రస్తుతం ఇంటి సభ్యుల సంఖ్య ఏడుకు చేరింది. కాగా పదమూడోవారానికిగానూ జరిపిన నామినేషన్‌...
13-10-2019
Oct 13, 2019, 11:43 IST
తెలుగు బుల్లితెరపై ఆసక్తికరంగా సాగుతున్న బిగ్‌బాస్‌ 3 షోకు మరికొద్ది రోజుల్లో ఎండ్‌ కార్డ్‌ పడనుంది. దీంతో బిగ్‌బాస్‌ విజేత...
13-10-2019
Oct 13, 2019, 08:15 IST
‘రాహుల్‌ సిప్లిగంజ్‌ నాకు మంచి స్నేహితుడు. మా ఇద్దరిది స్వచ్ఛమైన స్నేహబంధం. నేను రాహుల్‌తో ప్రేమలో ఉన్నానని సోషల్‌ మీడియాలో...
12-10-2019
Oct 12, 2019, 16:34 IST
సాక్షి, హైదరాబాద్‌:  బిగ్‌బాస్‌ హౌజ్‌లో సింగర్‌ రాహుల్‌తో తనకు ఉన్న అనుబంధంపై నటి పునర్నవి భూపాలం మరోసారి స్పందించారు. ఇటీవల...
12-10-2019
Oct 12, 2019, 14:57 IST
బిగ్‌బాస్‌ పన్నెండో వారం ముగింపుకు వచ్చినప్పటికీ అసలైన మజా రావటం లేదు. షో చూస్తే నిద్ర వస్తుందే తప్ప ఇంట్రస్ట్‌...
12-10-2019
Oct 12, 2019, 09:14 IST
బిగ్‌బాస్‌ పుట్టినరోజు వేడుకలు ముగింపుకు చేరుకున్నాయి. బిగ్‌బాస్‌ బర్త్‌డే సందర్భంగా.. బిగ్‌బాస్‌ నిద్రపోయే సమయంలో ఇంటి సభ్యులు నిశ్శబ్దంగా ఉండాలని ఆదేశించాడు. పైగా...
11-10-2019
Oct 11, 2019, 12:35 IST
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 కథ కంచికి చేరుతోంది. బిగ్‌బాస్‌ ఇంట్లో 80 రోజులు పూర్తయ్యాయి. ఫైనల్‌ ట్రోఫీ అందుకోడానికి మరో 20 రోజులు మాత్రమే...
11-10-2019
Oct 11, 2019, 11:27 IST
బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు హంట్‌ అండ్‌ హిట్‌ టాస్క్‌ ఇచ్చారు. ఇందులో ఇంటి సభ్యులకు వారికి తెలియని, ఇంతవరకూ చూడని వీడియోను ప్లే చేశాడు....
11-10-2019
Oct 11, 2019, 11:00 IST
బంజారాహిల్స్‌: బిగ్‌బాస్‌– 3లో టీవీ యాంకర్‌ శ్రీముఖి తళుక్కున మెరుస్తోంది. ఆమె ధరిస్తున్న దుస్తులు సరికొత్త అందాలకు చిరునామాగా మారాయి....
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top