షమితాబ్ సినిమాలో పాట పాడుతున్న అమితాబ్ | Big B works on song for 'Shamitabh' | Sakshi
Sakshi News home page

షమితాబ్ సినిమాలో పాట పాడుతున్న అమితాబ్

Jun 16 2014 11:57 AM | Updated on Sep 2 2017 8:54 AM

షమితాబ్ సినిమాలో పాట పాడుతున్న అమితాబ్

షమితాబ్ సినిమాలో పాట పాడుతున్న అమితాబ్

బాల్కి దర్శకత్వంలో కొత్తగా వస్తున్న 'షమితాబ్' చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ పాట పాడుతున్నారు.

బాల్కి దర్శకత్వంలో కొత్తగా వస్తున్న 'షమితాబ్' చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ పాట పాడుతున్నారు. అవధేష్ శ్రీవాస్తవతో కలిసి ఆయన మ్యూజిక్ స్టూడియోలో రాత్రి చాలా సేపు కూర్చున్నానని, షమితాబ్ సినిమా కోసం మరోసారి తాను పాట పాడుతున్నానని అమితాబ్ తన బ్లాగ్ ద్వారా తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకూర్చిన అద్భుతమైన బాణీలకు తాను పాడానని ఆయన రాశారు.

ఇళయరాజా సంగీత ప్రపంచంలో ప్రవేశించి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా, ఇప్పటికీ ఆయన స్వరాలు మాత్రం సరికొత్తగానే ఉంటాయని, ఆయన ప్రాధాన్యం అలాగే కొనసాగుతోందని అమితాబ్ చెప్పారు. చాలామంది సుప్రసిద్ధ సంగీతదర్శకులను ఆయన తయారుచేశారని, దాదాపు 900కు పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చారని ప్రశంసల జల్లు కురిపించారు. షమితాబ్ చిత్రంలో రజనీకాంత్ అల్లుడు ధనుష్, కమల్ కూతురు అక్షర కూడా నటిస్తున్నారు. అక్షర బాలీవుడ్ రంగప్రవేశం అమితాబ్ చిత్రంతో జరగడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement