బిగ్ బి అలా రిజెక్ట్ అయ్యారట! | Big B like many others was a struggling actor | Sakshi
Sakshi News home page

బిగ్ బి అలా రిజెక్ట్ అయ్యారట!

Feb 22 2016 4:28 PM | Updated on Sep 3 2017 6:11 PM

బిగ్ బి అలా రిజెక్ట్ అయ్యారట!

బిగ్ బి అలా రిజెక్ట్ అయ్యారట!

'ఫిలిం ఫేర్ మాధురి కాంటెస్ట్కు పంపించిన ఫోటో ఇదే.. దీన్ని రిజెక్ట్ చేయడంలో ఆశ్చర్యం ఏముంది' అంటూ అమితాబ్ బచ్చన్ తన ప్రయత్నాలను నెమరు వేసుకున్నారు.

న్యూఢిల్లీ:   ఆయా రంగాల్లో ప్రాథమికంగా తిరస్కరించబడినా...తదనంతరం కాలంలో  ఫీనిక్స్ పక్షిలా   ఉవ్వెత్తున  ఎగిసి..ఉన్నతస్థాయిని అందిపుచ్చుకున్న వారు  చరిత్రలో చాలామందే  ఉన్నారు. అలాంటి వారిలో  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒకరు. సన్నగా పీలగా ఉన్నావని,  కంఠం బాలేదని తిరస్కరించిన బాలీవుడ్లోనే  నిరుపమాన నటనతో   బిగ్ బీ గా అవతరించిన   ఖ్యాతి అమితాబ్ కే దక్కుతుంది.  

ఇండస్ట్రీలో నిలదొక్కుకొని, సూపర్ స్టార్ గా అవతరించడానికి  గల అలనాటి తన ప్రయత్నాలను తలచుకుంటూ అమితాబ్ ఒక  అరుదైన ఫోటోను  సోషల్ మీడియాలో షేర్ చేశారు.  టాలెంట్ హంట్ కోసం తాను పంపించిన ఫోటోను, అది   తిరస్కరించబడ్డ తీరును అభిమానులతో ట్విట్టర్ లో పంచుకున్నారు.   సినిమాల్లో ప్రవేశంకోసం పోరాడుతున్న రోజుల్లో  ఓ పోటీకి పంపిన  బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ట్వీట్ చేస్తూ  ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.   

'ఫిలిం ఫేర్  మాధురి కాంటెస్ట్కు పంపించిన ఫోటో ఇదే..  దీన్ని రిజెక్ట్ చేయడంలో ఆశ్చర్యం ఏముంది' అంటూ తన   ప్రయత్నాలను నెమరు వేసుకున్నారు.   ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ దర్శకత్వం లో వచ్చిన సాత్ హిందుస్తానీ  సినిమాతో సినీరంగలోకి అడుగుపెట్టిన  అమితాబ్ బచ్చన్ తన కెరియర్ లో ఎన్నో  అద్భుతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. మరెన్నో   మైలురాళ్లను అధిగమించారు.  ఆయన  అద్భుతమైన నటనకు గాను అనేక పురస్కారాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

T 2152 - This the picture I sent to FilmfareMadhuri Contest to join films .. is it any wonder they rejected me !! pic.twitter.com/49ECTENzrk

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement