గుమ్మడికాయ కొట్టారు

Balajkrishna new movie Ruler updates - Sakshi

‘రూలర్‌’ చిత్రానికి గుమ్మడికాయ కొట్టారు. బాలకృష్ణ హీరోగా కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటించారు. సి. కల్యాణ్‌ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. ‘‘మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు శక్తివంతమైన పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో పాటల లిరికల్‌ వీడియోను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రానికి సీవీ రావ్, పత్సా నాగరాజు సహ–నిర్మాతలు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top