బాలయ్య 102 కోసం పవర్ ఫుల్ టైటిల్..? | Bala krishna, Ks Ravikumar movie title Ruler | Sakshi
Sakshi News home page

బాలయ్య 102 కోసం పవర్ ఫుల్ టైటిల్..?

Jul 5 2017 4:30 PM | Updated on Sep 5 2017 3:17 PM

బాలయ్య 102 కోసం పవర్ ఫుల్ టైటిల్..?

బాలయ్య 102 కోసం పవర్ ఫుల్ టైటిల్..?

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తన నెక్ట్స్ సినిమాను కూడా ఫైనల్ చేశాడు బాలకృష్ణ. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే కథా కథనాలు రెడీ అయిన ఈ సినిమాను ఆగస్టు 2న కుంభకోణంలో ప్రారంభించనున్నారు.

తాజాగా ఈ సినిమా టైటిల్కు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ చిత్ర నిర్మాత సీ కళ్యాణ్, తన సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూలర్ అనే టైటిల్ను రిజిస్టర్ చేయించాడు. దీంతో ఈ పవర్ఫుల్ టైటిల్ బాలయ్య కోసమే అని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్. బాలయ్య ఇమేజ్కు రూలర్ టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. అయితే ఈ టైటిల్ నిజంగా బాలయ్య కోసమా.. కాదా తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement