నా నడకలోనూ కిక్కు ఉంది.. దానికో లెక్కుంది

anu emmanuel Style Variations In Sailaja Reddy Alludu - Sakshi

సినిమా: నా నడకే ఒక కిక్కు అంటోంది నటి అను ఇమ్మానుయేల్‌. ఏంటీ అంత సీన్‌ లేదు అని అనుకుంటున్నారా? మీరేమైనా అనుకోండి నా స్టైలే వేరు అంటోంది ఈ అమ్మడు. అన్నట్టు ఈమె చికాగో బ్యూటీ అన్న విషయం ఎందరికి తెలుసు? అయితే మాలీవుడ్‌కు బాల నటిగా కాలు పెట్టి, అక్కడే కథానాయకిగా కూడా నటించేసింది. ఇంకేముంది మాలీవుడ్‌లో నటిస్తే టాలీవుడ్, కోలీవుడ్‌లకు ఈ బ్యూటీ ఎంట్రీ ఈజీనే అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే జరిగింది. మాలీవుడ్‌ నుంచి సరాసరి టాలీవుడ్‌కు ఆపై కోలీవుడ్‌కు దిగుమతి అయిపోయింది. తెలుగులో మజ్ను చిత్రం మంచి విజయాన్ని అందించడంతో అక్కడ చకచకా పవన్‌కల్యాణ్, అల్లుఅర్జున్‌ లాంటి స్టార్‌ హీరోలతో రొమాన్స్‌ చేసేసింది. అయితే అవేవి అమ్మడి కెరీక్‌కు ఉపయోగపడలేదు. తాజాగా నాగచైతన్యతో నటించిన శైలజారెడ్డి అల్లుడు ఇటీవల తెరపైకి రానుంది. ప్రస్తుతం మరో అవకాశం చేతిలో లేదు. ఇక కోలీవుడ్‌లోనూ మంచి ఎంట్రీనే లభించింది.

విశాల్‌కు జంటగా తుప్పరివాలన్‌ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఆ చిత్రం హిట్‌ అయినా అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అమ్మడు వార్తల్లో ఉంటూ ఉచిత ప్రచారం పొందాలనుకుంటోంది. అందులో భాగంగానే నా నడకలోనూ కిక్కు ఉంది అని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఇంతకీ ఈ జాణ ఏమంటుందో చూస్తే ఓ పనైపోద్దిగా! నేను చీర కట్టినా నాలో అమెరికా యువతి చాయలు కనిపిస్తున్నాయని అంటున్నారు. నేను చీర కట్టినా, సెర్చ్‌కు వెళ్లినా నా శారీరక భాష భారతీయ అమ్మాయిలకు భిన్నంగానే ఉంటుంది. నేను కూర్చున్నా, నడిచినా భారతీయ స్త్రీల మాదిరి ఉండదు. ఇంకా చెప్పాలంటే నా నడకలోనే ఓ కిక్కు ఉంటుంది. అందుకు లెక్క నేను అమెరికా అమ్మాయి కావడమే.

ఇక్కడ చిత్రాల్లో నటిస్తుండడంతో ఇండియన్‌ స్త్రీల వస్త్రాధరణను గమనిస్తూ అలవాటు చేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నేను చాలా శాంత స్వభావిని. గట్టిగా మాట్లాడను కూడా. ఇతరులు ఎంతగా మాట్లాడుతున్నా గమనిస్తూ ఉంటాను. అలాంటి ఇప్పుడు ఒక చిత్రంలో నా స్వభావానికి విరుద్ధమైన పాత్రలో నటిస్తున్నాను. ఈర్శా్యభావం కలిగిన అమ్మయిగా బిగ్గరగా అరచి నటించిన సన్నివేశాలు చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది అని అంటున్న అనుఇమ్మానుయేల్‌ తను అంతగా హంగామా చేసి నటిస్తున్న చిత్రం ఏదో చెప్పలేదు. బహుశా తెలుగు చిత్రం శైలజారెడ్డి అల్లుడు అనుకుంటా.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top