సైరా.. అమితాబ్‌ లుక్‌ వచ్చేస్తోంది..! | Amitabh Look In Sye raa Will Be Released On His Birthday | Sakshi
Sakshi News home page

Oct 9 2018 10:24 AM | Updated on Oct 9 2018 10:24 AM

Amitabh Look In Sye raa Will Be Released On His Birthday - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా కు సురేందర్ రెడ్డి దర్శకుడు. 2019లో రిలీజ్‌ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను ఇప్పటి నుంచే ప్రారంభించారు. బాహుబలి తరహాలో సైరా ప్రమోషన్స్‌ను ప్లాన్‌చేస్తున్నారు చిత్ర యూనిట్‌.

సినిమాలో నటించిన ప్రధాన పాత్రధారుల పుట్టిన రోజులను పురస్కరించుకొని సినిమాలో వారి లుక్స్‌ను రివీల్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి, కన్నడ నటుడు సుధీప్‌ లుక్స్‌ను రివీల్ చేసిన చిత్రయూనిట్‌, త్వరలో బిగ్‌ బి అమితాబ్‌ లుక్‌ను రివీల్ చేయనున్నారు. అక్టోబర్ 11న అమితాబ్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే అక్టోబర్‌ 10న బిగ్‌బి లుక్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ లోకేషన్‌లోని కొన్ని స్టిల్స్‌ను బిగ్‌బి అభిమానులతో షేర్‌ చేసుకోగా ఆయన పుట్టిన రోజు సినిమాలోని క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ అధికారిక పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement