అన్ని పాత్రలూ గమ్మత్తుగా ఉంటాయి | All the characters are funny - Actor Rajendra Prasad | Sakshi
Sakshi News home page

అన్ని పాత్రలూ గమ్మత్తుగా ఉంటాయి

Mar 25 2017 1:13 AM | Updated on Apr 3 2019 9:02 PM

అన్ని పాత్రలూ గమ్మత్తుగా ఉంటాయి - Sakshi

అన్ని పాత్రలూ గమ్మత్తుగా ఉంటాయి

‘‘డిఫరెంట్‌ సినిమాలు తీయడం ‘నిధి’ ప్రసాద్‌ అలవాటు.

‘‘డిఫరెంట్‌ సినిమాలు తీయడం ‘నిధి’ ప్రసాద్‌ అలవాటు. టైటిల్‌లోనే ఆ డిఫరెన్స్‌ కనబరిచారు. అలవాటు ప్రకారం పక్కా కమర్షియల్‌ పద్ధతిలో ప్రేక్షకుల్ని నవ్వించేలా అన్ని పాత్రలనూ గమ్మత్తుగా మలిచారు’’ అన్నారు నటుడు రాజేంద్రప్రసాద్‌. ‘నిధి’ ప్రసాద్‌ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, సాక్షీ చౌదరి, అలీ, బ్రహ్మానందం, రిషి ముఖ్య తారలుగా భాగ్యలక్ష్మి నిర్మిస్తు న్న ‘ఊ.పె.కు.హ’(ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అనేది ఉపశీర్షిక) టైటిల్‌ లోగో ఆవిష్కరణ జరిగింది.

‘‘నేను సినిమా తీసి చాలా కాలమైంది. ఈ పరిస్థితుల్లో సినిమా తీయలేనని కొందరన్నారు. అయితే వారు చెప్పిన దానికీ, ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధమే లేదు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ ఎంతో సపోర్ట్‌ చేశారు. కథపై నమ్మకంతో మా కుటుంబ సభ్యులే నిర్మిస్తున్నారు’’ అని ‘నిధి’ ప్రసాద్‌ అన్నారు. ‘‘మా బావగారు ‘నిధి’ ప్రసాద్‌ని ఒప్పించి, ఈ సినిమా తీస్తున్నాను’’ అని నిర్మాతల్లో ఒకరైన విక్రమ్‌ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పి.నాగరాజ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement