సోషల్ మీడియాలో హీరో ఆందోళన! | All industries facing piracy and unethical reviewing, says Siddharth | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలో హీరో ఆందోళన!

Sep 8 2016 1:30 PM | Updated on Oct 2 2018 2:40 PM

సోషల్ మీడియాలో హీరో ఆందోళన! - Sakshi

సోషల్ మీడియాలో హీరో ఆందోళన!

భారత్లో అన్ని సినీ ఇండస్ట్రీలను ఒకే సమస్య పట్టి పీడిస్తుందని టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ అంటున్నాడు.

భారత్లో అన్ని సినీ ఇండస్ట్రీలను ఒకే సమస్య పట్టి పీడిస్తుందని టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ అంటున్నాడు. సినీ ఇండస్ట్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకుంటూనే తగిన సూచనలు ఇచ్చాడు. పైరసీ సమస్య ఇండస్ట్రీలకు ప్రధాన శత్రువు అని, దాంతో పాటు అసంబద్దమైన సినిమా విశ్లేషణ(రివ్యూ)లు సినిమాలను మార్కెట్ పరంగా దారుణంగా దెబ్బతీస్తున్నాయని వరుస ట్వీట్లు చేశాడు. సినిమా చేయాలంటేనే ఆసక్తి రావడం లేదని, వాటిపై గౌరవం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు.

సినిమా చూసిన వాళ్లు సాధ్యమైనంత త్వరగా విమర్శించడం జరుగుతుంటుందని, అలాంటివి కామన్ అయ్యాయని పేర్కొన్నాడు. కానీ, సినిమా చూస్తూనే లైవ్ ట్వీట్లు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రేక్షకులను సిద్ధార్థ్ ప్రశ్నించాడు. వాస్తవానికి మూవీ చూస్తూ ట్వీట్ చేస్తుంటే.. మీరు ఫోన్ ను చూస్తారా.. లేక తెరపై మూవీ చూస్తారా.. ఇలా ఒకేసారి బ్రెయిన్ రెండు పనులు చేయడం సాధ్యం కాదంటున్నాడు. హాల్లో ఉన్నప్పుడు మూవీ చూడటం కరెక్టా..? లేకపోతే స్టుపిడ్ ఫోన్ పై మనసు పెట్టాలా అనేది మీరు నిర్ణయించుకోవాలని హీరో సిద్ధార్థ తన అసహనాన్ని వెల్లగక్కాడు. ఫోన్లలో మూవీలు చూస్తే ఏదో రూపంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సూచించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement