ఆలియా ఓటు వేయదట ఎందుకంటే..

Alia Bhatt reveals she can Not Vote In Lok Sabha Elections 2019 - Sakshi

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయబోనని చెబుతోంది బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ ఆలియా భట్‌. తన దగ్గర ఇండియన్‌ పాస్‌ పోర్టు లేదని అందుకే ఓటు వేయలేకపోతున్నానని చెప్పింది. వరుణ్ ధావన్‌, అలియా భట్ లీడ్ రోల్స్‌లో వ‌స్తున్న తాజా చిత్రం 'క‌ళంక్. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్‌ కపూర్ నటిస్తున్నారు. కళంక్‌ టీంతో ఇండియా టూడే ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రభావం మీపై ఎలా ఉంది అని ప్రశ్నించగా.. వరుణ్‌, సోనాక్షి, ఆదిత్యలు ఓటు వేయడం మా బాధ్యత అని చెప్పారు. ఇక ఆలియానును అడగ్గా తాను ఓటు వేయలేనని చెప్పింది. తనకు ఇండియన్‌ పాస్‌పోర్టు లేదని అందుకే ఓటు వేయలేనని సెలవిచ్చింది. భారత రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. ఆలియా భట్‌ బ్రిటీష్‌ పౌరురాలు అందుకే ఆమెకు భారత్‌లో ఓటు హక్కులేదు. 

అభిషేక్ వ‌ర్మ డైర‌క్ట్ చేస్తున్న ‘కళంక్‌’ మూవీని క‌ర‌ణ్ జోహ‌ర్‌, సాజిద్ల న‌దియావాలా, ఫాక్స్ స్టూడియోస్ క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మాధురి దీక్షిత్, సంజయ్ ద‌త్‌, సోనాక్షి సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్‌ కపూర్ లు  న‌టిస్తున్నారు. ఏప్రిల్ 17న సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top