స్టార్‌ హీరో సీరియస్‌ వార్నింగ్‌

Ajith Fan Chased His Car For 18 KM To Meet Him - Sakshi

హీరోలను దైవంలా భావించి ఆరాధించే అభిమానులు ఉంటారు. అయితే కొన్నిసార్లు అభిమానులు చేసే పనులు హీరోలకి కోపాన్ని తెప్పిస్తాయి. హద్దులు మీరి ప్రవర్తించడం వల్ల హీరోలకు ఇబ్బంది కర పరిస్థితులు ఎదురవుతాయి. తమిళనాడులో బెస్ట్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న అగ్ర హీరోల్లో అజిత్‌ ఒకరు. సూపర్‌స్టార్‌ రజనీ, కమల్‌ హాసన్‌, విజయ్‌ల తర్వాత అంతటి ఫ్యాన్‌ పాలోయింగ్‌ ఉన్న స్టార్‌ హీరో అజిత్‌. అయితే ఇటీవల ఈ స్టార్‌ హీరోకి ఓ అభిమాని చేసిన పని కోపం తెప్పిచ్చింది. తనను కలిసేందుకు తన వాహనాన్ని వెంబడిస్తూ 18 కిలో మీటర్లు వచ్చాడు. అతన్ని కలిసిన అజిత్‌ మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదని మందలించి పంపించేశాడు. 

కారులో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న అజిత్‌ని గణేష్‌ అనే అభిమాని చూశాడు. దీంతో తన అభిమాన హీరోని కలవాలని గణేష్‌ బైక్‌పై అజిత్‌ కారును ఫాలో అయ్యాడు. దాదాపు 18 కిలోమీటర్లు అజిత్‌ కారును చేజ్‌ చేశాడు. గణేష్‌ను గమనించిన అజిత్‌ తన కారును ఆపి గణేష్‌తో మాట్లాడారు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయ్యొద్దని మందలించి సెల్ఫీ దిగి పంపేశారు.

ఇదే విషయాన్ని గణేష్‌ సోషల్‌ మీడియాలో ఫోస్ట్‌ చేశాడు. ‘నేను నా అభిమాన హీరో అజిత్‌ని కలిశాను. గతంలో నాలుగు సార్లు అజిత్‌ని కలిసినా ఫోటో దిగలేకపోయాను. ఈ సారి ఎలాగైనా అతనితో సెల్ఫీ దిగాలని డిసైడ్‌ అయ్యాను. అజిత్‌ కారును చేజ్‌ చేశాను. నన్ను చూసి అజిత్‌ కారు ఆపి నాతో మాట్లాడారు. నా పేరు కూడా అడిగి తెలుసుకున్నాడు. అయితే ఇంకోసారి ఇలాంటి పనులు చేయకూడదని నాకు సూచించారు. ఇలా చేసినందుకు క్షమించమని అజిత్‌ను కోరాను. నా హీరోని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంద’ని గణేష్‌ ఫేస్‌బుక్‌లో ఫోస్ట్‌ చేశాడు. అలాగే విడుదలకు సిద్దంగా ఉన్న అజిత్‌ ‘విశ్వాసం’ సినిమా సూపర్‌ హిట్‌ కావాలని కోరుకున్నాడు.

అజిత్‌ హిరోగా తెరకెక్కుతున్న ‘విశ్వాసం’ సినిమా షూటింగ్‌ పూరైంది. వీరమ్, వేదాలం, వివేగమ్‌ చిత్రాల తర్వాత హీరో అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘విశ్వాసం’.  డి.ఇమ్మాన్‌ సంగీతం అందించిన ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top