బాలీవుడ్‌లో ప్రేమ్‌ కీ కహానీ!

After Saaho, Telugu superstar Prabhas to be seen in a Bollywood romantic film - Sakshi

బాలీవుడ్‌లో ప్రజెంట్‌ టాప్‌ హీరోలు ఎవరు?... అమితాబ్‌ బచ్చన్, సల్మాన్‌ ఖాన్, షారుక్‌ ఖాన్, ఆమిర్‌ ఖాన్‌... ఇలా రేస్‌లో చాలామంది  ఉన్నారు. కానీ బాలీవుడ్‌లో 500 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాల లిస్ట్‌ గురించి మాట్లాడితే.. అందులో ‘బాహుబలి’ మొదటి వరసలో ఉంటుంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించిన సినిమా ‘బాహుబలి’ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే.. ఇప్పుడు బాలీవుడ్‌ టాప్‌ యాక్టర్స్‌ లిస్ట్‌లో చేరేందుకు ప్రభాస్‌ రెడీ అవుతున్నారు. అదేనండీ.. ప్రభాస్‌ బీటౌన్‌లో హీరోగా చేయబోతున్నారు అని చెబుతున్నాం. ‘‘నేను హిందీ సినిమాలు చూస్తాను. హైదరాబాద్‌లో 60 పర్సెంట్‌ పీపుల్‌ హిందీలో మాట్లాడగలరు. బాలీవుడ్‌ నుంచి మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి.

హిందీ సినిమాలో నటించడానికి మూడేళ్ల క్రితం ప్రేమ కథ విన్నాను. నచ్చింది. ‘సాహో’ తర్వాత నటించాలనుకుంటున్నాను. బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ ‘బాహుబలి’ టీమ్‌కి హెల్ప్‌ చేశారు. ఆయన ఇచ్చిన  పార్టీలో బాలీవుడ్‌ యాక్టర్స్‌ను కలిశాను’’ అని పేర్కొన్నారు ప్రభాస్‌. మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలిగా శక్తిమంతమైన పాత్రల్లో కనిపించిన ప్రభాస్‌ నెక్స్‌›్ట హిందీలో ప్రేమ్‌ కీ కహానీలో కనిపించడం కొత్తగా ఉంటుందనే చెప్పాలి. ప్రజెంట్‌ ‘రన్‌ రజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్‌ కథానాయిక. ప్రస్తుతం న్యూ ఇయర్‌ హాలిడేస్‌లో ఉన్న ప్రభాస్‌ త్వరలో ఈ మూవీ నెక్ట్స్‌ షెడ్యూల్‌లో జాయిన్‌ అయ్యేందుకు రెడీ అవుతున్నారట.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top