సేద్యం చేస్తున్న నటి కీర్తీ.. | Actress Keerthy Pandian Farming in Tamil Nadu Lockdown time | Sakshi
Sakshi News home page

సేద్యం చేస్తున్న యువ నటి

May 7 2020 12:22 PM | Updated on May 7 2020 12:22 PM

Actress Keerthy Pandian Farming in Tamil Nadu Lockdown time - Sakshi

వరినాట్లు వేస్తున్న కీర్తి పాండియన్‌

సినిమా: కరోనా  మహమ్మారి ప్రముఖులను సైతం ఇంతకు ముందు చేయనటువంటి పనులను చేయిస్తోంది. పలువురు నటీనటులు తమకు ఇంతకు ముందు పరిచయం లేని పనులను చేస్తున్నారు. నటి కీర్తీ పాండియన్‌ సేద్యం చేయడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ నటుడు అరుణ్‌ పాండియన్‌ వారసురాలైన ఈమె తుంబ అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ప్రస్తుతం విలన్‌ అనే మలయాళ చిత్ర తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు.

ఇందులో ఆమెతో పాటు తండ్రి అరుణ్‌ పాండియన్‌ కూడా నటిస్తున్నారు. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్‌ పడడంతో నటి కీర్తి పాండియన్‌ కూడా తన స్వగ్రామానికి వెళ్లి వ్యసాయం చేయడానికి సిద్ధమయ్యారు. ఇటీవల తను ట్రాక్టర్‌ ఎక్కి పొలాన్ని దున్నుతున్న వీడియోను విడుదల చేశారు. తాజాగా పొలంలో నాట్లు వేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు పలువురికి స్ఫూర్తినిచ్చేదిగా నిలుస్తోంది. హీరోయిన్లు అంటే అద్దాల మేడలో నివసించే సున్నితమైన వారనే అర్ధాన్ని నటి కీర్తి పాండియన్‌ మార్చేసింది అనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement