హాయ్‌ నాన్నతో నాని నిలబడతాడా? | Actor Nani Interesting Comments On Hi Nanna Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Hai Nanna Movie: హాయ్‌ నాన్నతో నాని నిలబడతాడా?

Dec 6 2023 10:14 AM | Updated on Dec 6 2023 12:26 PM

Nani Comments On Hi Nanna Movie - Sakshi

తమిళసినిమా: టాలీవుడ్‌ నటుడు నాని తమిళ ప్రేక్షకులకు పరిచయం లేని వ్యక్తి కాదు. ఇంకా చెప్పాలంటే తొలి రోజుల్లో ఆయన ఇక్కడ వెప్పమ్‌ వంటి ఒకటి రెండు చిత్రాల్లో నటించారు కూడా. ఇక తెలుగు సూపర్‌ హిట్‌ చిత్రం ఈగ తమిళంలో నాన్‌ ‘ఈ’ పేరుతో విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆ చిత్ర క్రెడిట్‌ అంతా దర్శకుడు రాజమౌళి, నటి సమంత ఖాతాలోకి వెళ్లి పోయింది.

కాగా ఆ తరువాత నాని తెలుగులో నటించిన చిత్రాలను తమిళంలోనూ విడుదల చేసి ఇక్కడ కూడా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించారు. అలా అంటే సుందరినికి , దసరా చిత్రాలను తమిళంలో విడుదల చేయాలని తల పెట్టారు. అయితే అంటే సుందరినికి చిత్రాన్ని విడుదల చేయలేక పోయారు.

ఇక దసరా చిత్రాన్ని ఇక్కడ విడుదల చేసినా, ఆశించిన విజయం అందుకోలేక పోయింది. ఈసారి హాయ్‌ నాన్న చిత్రంతో వస్తున్నారు. మృణాల్‌ ఠాగూర్‌ నాయకిగా నటించిన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో ఈ నెల 7న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇటీవల చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడుతూ తాను ఇంతకు ముందు తమిళం కొన్ని చిత్రాల్లో నటించానని, అయితే ఇక్కడి వారు తనను తెలుగు నటుడిగా భావించారన్నారు.

తెలుగు వారు తమిళ చిత్రాలుగా భావించరాదన్నారు. అయితే బాహుబలి, కాంతార వంటి చిత్రాల ఎవరు ఏ భాషలోనైనా నటించి విజయం సాధించవచ్చని రుజువైందన్నారు. కాగా హాయ్‌ నాన్న అందమైన ప్రేమకథా చిత్రంగా ఉంటుందన్నారు. కచ్చితంగా ఈ చిత్రం అందరినీ అలరిస్తుందనే నమ్మకాన్ని నాని వ్యక్తం చేశారు. మరి తమిళంలో నిలదొక్కుకోవాలన్న ఆయన కోరికను ఈ చిత్రం నెరవేరుస్తుందో..? అన్నది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.

Advertisement
 
Advertisement
Advertisement