ఆ హద్దులేంటో నాకు తెలియదు | actress hansika motwani chit chat | Sakshi
Sakshi News home page

ఆ హద్దులేంటో నాకు తెలియదు

May 29 2015 4:14 AM | Updated on Apr 3 2019 9:05 PM

ఆ హద్దులేంటో నాకు తెలియదు - Sakshi

ఆ హద్దులేంటో నాకు తెలియదు

ఆ హద్దులేంటో నాకు తెలియదు అంటున్నారు నటి హన్సిక. ఇంతకీ ఈ బ్యూటీ ఏ విషయం...

ఆ హద్దులేంటో నాకు తెలియదు అంటున్నారు నటి హన్సిక. ఇంతకీ ఈ బ్యూటీ ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవాలన్న కూతూహలం ఉండడం సహజం. అలాంటి హన్సిక గురించి క్లుప్తంగా రెండు మాటలు. నటుడు శింబుతో ప్రేమ, పెళ్లి వైఫల్యం వంటి బాధాకరమైన సంఘటనలను నిజ జీవితంలో ఎదుర్కొన్న వ్యక్తిగతం వేరు, వృత్తి వేరు అంటూ రెండు పార్శ్యాల్లో జీవన విధానాన్ని విభజించుకుని ముందుకు సాగుతున్న నటి హన్సిక.

కెమెరా ముందు కొచ్చారంటే ఇతర విషయాలేవీ మదిలోకి రానీయని హన్సిక తానొక నటి నన్న విషయాన్ని మాత్రమే గుర్తు పెట్టుకుంటారని చెప్పవచ్చు. అందుకే హన్సిక ప్రేమలో ఓడినా నటిగా గెలుస్తునే ఉన్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను చిత్రాలు ఉండడం ఇందుకు నిదర్శనం. ఈ సందర్భంగా ఈ సంచలన నటితో చిట్‌చాట్.....

 
ప్ర:
మీ సినీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతున్నట్లుందే?
జ: నిజమే. చాలా సంతోషంగా ఉంది. పక్కింటి అమ్మాయి ఇమేజ్‌తో నిడారంబరతతో కూడిన పాత్రలు లభిస్తున్నాయి. అవి నా అభిమానులకు తప్పకుండా నచ్చుతాయనే నమ్మకం ఉంది.
 
ప్ర: మరేమో హోమ్లీ పాత్రలంటున్నారు. బయటేమో రోమియో జూలియట్ చిత్రంలో ఆ చిత్ర హీరో జయంరవితో చాలా సన్నిహితంగా నటించారనే ప్రచారం జరుగుతోందిగా?
జ: నిజానికి మీరంటున్న సన్నిహితం అన్నదానికి హద్దులేమిటో నాకు తెలియదు. స్క్రిప్ట్ ఏమి డిమాండ్ చేస్తుందో అదే చేయడం నటి పని. ఎంగేయుం కాదల్ చిత్రం తరువాత మళ్లీ ఈ చిత్రంలో జయంరవితో కలసి నటించడం సంతోషంగా ఉంది. ఆ చిత్రంలోని పాటల మాదిరిగానే ఈ చిత్రంలోని పాటలు మంచి హిట్ అయ్యాయి.
 
ప్ర: మల్టీ హీరోయిన్ల కథాచిత్రాల్లోనే నటిస్తున్నట్టున్నారు?
: నేను నటించే చిత్రంలో హీరోయిన్లు ఎందరున్నారు? ఎవరెవరు నటిస్తున్నారన్న విషయాల గురించి అస్సలు పట్టించుకోను. నా పాత్ర ఏమిటి? దాని ప్రాముఖ్యత ఎంత? అన్న విషయాల గురించే ఆలోచిస్తాను. అరణ్మణై చిత్రంలో నాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటించారు. అయినా ఆ చిత్ర కథ నడిచేది నా పాత్ర ద్వారానే నన్నది గమనించాలి. చిత్రం పూర్తి అయిన తరువాత ప్రేక్షకుల మనస్సుల్లో ఉండేది నా ముఖమే.
 
ప్ర: అది సరే. కమర్షియల్  హీరోయిన్‌గా రాణించడంపై దృష్టి పెట్టారన్న వాదనపై మీ స్పందన?
జ: అందులోనూ నిజం లేదు. అరణ్మణై చిత్రంలో దెయ్యంగా నటించాను. సింగం-2 లో విద్యార్థిని పాత్ర పోషించాను. ఇవన్నీ కమర్షియల్ హీరోయిన్ పాత్రలా? నటనకు అవకాశం వున్న పాత్రలు లభిస్తుంటే వాటిని చేయడానికి వెనుకాడను. ఇక రోమియో జూలియట్, పులి చిత్రాల విడుదల అనంతరం ఇలాంటి ప్రశ్నలకు తావే ఉండదు.
 
ప్ర: పులి చిత్రం నటించిన అనుభవం గురించి?
జ: ఇప్పటి వరకు నేను నటించని పాత్రను పులి చిత్రంలో చేస్తున్నాను.  నన్నే నాకు నచ్చేలా చేసిన పాత్ర అది. పులి చిత్రంలో ప్రతిరోజు ఉత్సాహంగా నటించాను. ఇక విజయ్‌తో నటించేటప్పుడు అదనపు ఎనర్జీ వచ్చేది. నేను 100వ చిత్రం చేసిన తరువాత కూడా తిరిగి చూసుకుంటే పులి చిత్రం ఎదురుగా నిలబడుతుంది. అలాంటి పాత్రను ఆ చిత్రంలో చేశాను.
 
ప్ర: బాలీవుడ్ అవకాశాలను వదులుకుంటున్నారట?
జ: అవును. నిజానికి నేను బాలతారగా పరిచయం అయ్యింది బాలీవుడ్ లోనే. అక్కడ ఒక చిత్రంలో హీరోయిన్‌గా కూడా నటించాను. అయినా దక్షిణాది చిత్ర పరిశ్రమనే నాకు నచ్చింది. నేనేదో గొప్ప కోసం చెప్పుకోవడం లేదు. హిందీలో నాలుగు చిత్రాలు అవకాశాలను నిరాకరించాను. కారణం నాకు తమిళ చిత్రాలు, తమిళ సినీ అభిమానులు నచ్చా రు. కొత్తగా ఇక్కడ మరో మూడు చిత్రాలు కమిట్ అయ్యాను. వాటిని పూర్తి చేసిన తరువాత ఇతర భాషా చిత్రాల అవకాశాలను బాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తాను.
 
ప్ర: ప్రేమ, పెళ్లి గురించి?

జ: చెప్పుకోవడానికి ఎన్నో విషయాలు ఉండగా మళ్లీ మళ్లీ వాటి ప్రస్తావన ఎందుకు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement