పరిస్థితి మెరుగయ్యేదాకా షూటింగ్‌లు ఆపాలి!

Actors Are Most VulnerableSays Bipasha Basu After Parth Samthaan Tested Positive - Sakshi

షూటింగ్‌లలో నటీనటులకే ఎక్కువ ప్రమాదం : బిపాసా బసు

ఎలాంటి రక్షణ కిట్లు లేకుండా నటించాలి

పరిస్థితి కాస్త చక్కబడేవరకు షూటింగ్‌లను నిలిపివేయాలి

సాక్షి, ముంబై:  కరోనా మహమ్మారి  అటు బాలీవుడ్ ప్రముఖులను, ఇటు బుల్లి తెర నటులను బెంబేలెత్తిస్తోంది. వరుసగా నటులు కరోనా బారినపడుతూ ఉండటంతో లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత మొదలైన షూటింగ్‌ల సందడి నీరుగారిపోయింది. దీనికి తోడు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, సీనియర్‌ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబానికి వైరస్‌ సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది. షూటింగ్‌ సమయంలోనే అమితాబ్‌కు వైరస్‌ అంటుకుందన్నఅంచనాలు ఈ భయాలకు మరింత తోడయ్యాయి.

దక్షిణాది టీవీ నటుడు,  ఏక్తా కపూర్  నిర్మిస్తున్న ‘కసౌతి జిందగీ కే-2’ నటుడు పార్థ్‌ సమతాన్‌కు కోవిడ్‌-19 పాజిటివ్‌ రావడంతో నటి బిపాసా బసు సోషల్‌ మీడియాలో స్పందించారు.  కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు నటీనటులకే ఎక్కువ ఉన్నాయంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు కొంత కాలంపాటు షూటింగ్‌లకు దూరంగా ఉంటే మంచిదని ఆమె సూచించారు. యూనిట్ సభ్యులు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లు, ఫేస్ షీల్డ్స్ లాంటి సేఫ్టీ మెజర్స్‌తో పనిచేయవచ్చు..కానీ నటులకు అలాంటి పరిస్థితి లేదు.  మాస్క్‌లు తదితర రక్షణ కవచాలు లేకుండానే  నటించాల్సి ఉంటుందని బిపాసా బసు గుర్తు చేశారు. నటీనటులు కరోనా బారిన పడుతుండటానికి ఇదే కారణమన్నారు. అందుకే పరిస్థితులు మెరుగయ్యేంతవరకు అన్ని రకాల షూటింగులను ఆపేయాలని కోరారు. (నటుడికి కరోనా‌.. సహా నటులకు కోవిడ్‌ పరీక్షలు)


మరోవైపు బిపాసా బసు భర్త, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్,  కసౌతి జిందగీ కే 2 లో మిస్టర్ బజాజ్ పాత్రను పోషించారు. అయితే  కరోనా కారణంగా కరణ్ సింగ్ ఈ ప్రాజెక్టునుంచి తప్పుకోవడంతో నటుడు కరణ్ పటేల్ ఈ పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఎపిసోడ్ల షూటింగ్‌ పూర్తయింది. ఈ వారంలో ఇవి టెలికాస్ట్‌ కావాల్సి ఉంది. అయితే పార్థ్ సమతాన్‌ కు కరోనా సోకడంతో ‘కసౌతి జిందగీ కే’ సెట్‌లో ప్రకంపనలు  రేపింది.  దీనిపై నిర్మాత ఏక్తా కపూర్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.(బాలీవుడ్‌లో మరో విషాదం)

కాగా కరోనా కట్టడికోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌లో క్రమంగా సడలింపుల నేపథ్యంలో టెలివిజన్ షోలు, సినిమాలు, ఇతర  ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రాజెక్టుల చిత్రీకరణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇటు తెలుగు టీవీ నటులు కూడా కరోనా బారిన పడటం కలవరం రేపిన సంగతి తెలిసిందే.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top