తనికెళ్ల భరణికి ‘బొల్లిముంత’ పురస్కారం
ప్రముఖ సినీనటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణికి బొల్లిముంత శివరామకృష్ణ కళాపురస్కారం ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రావిపాటి వీరనారాయణ చెప్పారు.
తెనాలి: ప్రముఖ సినీనటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణికి బొల్లిముంత శివరామకృష్ణ కళాపురస్కారం ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రావిపాటి వీరనారాయణ చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 26 నుంచి 28 వరకు బొల్లిముంత శివరామకృష్ణ స్మారక సాహితీ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇరవైఆరు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ పురస్కారాన్ని అందజేస్తామన్నారు. అనంతరం నాటకోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు.


