డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో... | aarya,hansika doing movie as Drug mafia background | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో...

Nov 24 2016 10:51 PM | Updated on May 25 2018 2:29 PM

డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో... - Sakshi

డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో...

విలక్షణ నటుడు ఆర్య, వైట్ బ్యూటీ హన్సిక జంటగా మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘మీగా మాన్’. తమిళంలో ఘన విజయం సాధించిన

విలక్షణ నటుడు ఆర్య, వైట్ బ్యూటీ హన్సిక జంటగా మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘మీగా మాన్’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని సర్వల ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సూర్య సాకేత్ పిక్చర్స్ పతాకంపై ‘మండే సూర్యుడు’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాతలు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కొలన ఎల్లారెడ్డి, సర్వల గణేశ్ యాదవ్ మాట్లాడుతూ- ‘‘డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇండియన్ డ్రగ్ మాఫియా నెట్‌వర్క్ ఎలా ఉంటుంది? వారి ప్లాన్స్ ఎలా ఉంటాయి? వంటి అంశాలను దర్శకుడు ఎంతో పరిశోధించి తెరకెక్కించాడు.

ఇందులో ఆర్య స్టైలిష్ అండర్ కవర్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. గ్లామర్‌తో పాటు అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలో హన్సిక నటించారు. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌ఎస్ తమన్, నిర్మాణ నిర్వహణ: శ్రీనివాసు రెడ్డి, సమర్పణ: బెల్లంకొండ శ్రీనిధి.

Advertisement
 
Advertisement
Advertisement