నన్ను చూసి కాలేజీలో భయపడుతుంటారు! | Aadu Magadura Bujji movie to be released shortly | Sakshi
Sakshi News home page

నన్ను చూసి కాలేజీలో భయపడుతుంటారు!

Nov 29 2013 1:28 AM | Updated on Sep 2 2017 1:04 AM

నన్ను చూసి కాలేజీలో భయపడుతుంటారు!

నన్ను చూసి కాలేజీలో భయపడుతుంటారు!

దక్షిణాదిన అన్ని భాషల్లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందంటున్నారు కథానాయిక అస్మితాసూద్. సుధీర్‌బాబుకి ఈ ముద్దుగుమ్మ జోడీగా నటించిన సినిమా

దక్షిణాదిన అన్ని భాషల్లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందంటున్నారు కథానాయిక అస్మితాసూద్. సుధీర్‌బాబుకి ఈ ముద్దుగుమ్మ జోడీగా నటించిన సినిమా ‘ఆడు మగాడ్రా బుజ్జి’. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకుడు. సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి నిర్మాతలు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అస్మిత విలేకరులతో మాట్లాడుతూ -‘‘ఇందులో నేను డాన్ చెల్లెల్ని. నా బ్యాగ్రౌండ్ చూసి నాతో మాట్లాడటానిక్కూడా కాలేజ్‌లో భయపడుతుంటారు. అలాంటి టైమ్‌లో మగాడిలా వస్తాడు సుధీర్. ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనిపించుకుంటాడు. ఓవరాల్‌గా నా కోసం పోరాడే ఓ మగాడి కథ ఇది’’అని చెప్పారు. 
 
 ఆమె ఇంకా మాట్లాడుతూ పోలీసుల్లా పనిచేసే అయిదుగురు సామాజిక కార్యకర్తల కథాంశంతో తెరకెక్కుతోన్న ‘ఆ అయిదుగురు’ చిత్రంలో ట్రైనింగ్ ఆఫీసర్‌గా భిన్నమైన పాత్ర పోషిస్తున్నానని, ఫాజిల్ దర్శకత్వంలో అయిదు కథలతో తెరకెక్కిన ఓ మలయాళం చిత్రంలో నటించానని చెప్పుకొచ్చారు. ‘‘కన్నడ చిత్రం ‘విక్టరీ’ నా తొలి సినిమా. ఆ తర్వాత వరుణ్‌సందేశ్‌తో ‘బ్రహ్మిగాడి ప్రేమకథ’ సినిమా చేశాను. ప్రసుతం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటిస్తున్నాను. కెరీర్ గ్రాఫ్‌ని నెమ్మదిగా పెంచుకునే పనిలో ఉన్నాను’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement