అరవైలో ఇరవైలా..

‘Ambi Ning Vayassaytho’ director explains Ambareesh - Sakshi

అరవై ఏళ్ల వయసులో ఓ యాక్షన్‌ స్టంట్‌ను సింగిల్‌ టేక్‌లో కంప్లీట్‌ చేయడం అంటే మాములు విషయం కాదు. కానీ ఈజీగా చేశారట కన్నడ నటుడు అంబరీష్‌. గురు దత్తా దర్శకునిగా పరిచయం అవుతున్న కన్నడ చిత్రం ‘అంబి నింగ్‌ వయసాయతో’. తమిళ నటుడు ధనుష్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘పవర్‌ పాండి’ సినిమాకు రీమేక్‌ ఇది. ‘అంబి నింగ్‌ వయసాయతో’ చిత్రంలో అంబరీష్‌కు జోడీగా సుహాసిని నటించారు.

ఓ కీలక పాత్రను సుదీప్‌ చేశారు. ‘‘ఇందులో రిటైర్డ్‌ స్టంట్‌ డైరెక్టర్‌గా అంబరీష్‌ సార్‌ నటించారు. సినిమాలో ఓ యాక్షన్‌ స్టంట్‌ను డూప్‌ లేకుండా చేశారు. 60 ఏళ్ల  వయసులో కూడా ఆయన ఎనర్జీ లెవల్స్‌ చూసి షాక్‌ అయ్యాను’’ అన్నారు డైరెక్టర్‌ గురు దత్తా. 60లో 20 ఏళ్ల కుర్రాడిలా అంబరీష్‌ ఫైట్‌ చేయడం యూనిట్‌లో ఇతర సభ్యులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కొత్త లుక్‌ను అంబరీష్‌ సతీమణి, నటి సుమలత రిలీజ్‌ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top