అమ్మలా చూసుకుంటానంది.. కేసు పెట్టింది

Sad Ending Telugu  Love Story By Raju - Sakshi

నా పేరు రాజు. నవ్య,నేను 14 ఏళ్లుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. తనకి నేనంటే పిచ్చి ఇష్టం. నన్ను చాలా బాగా చూసుకునేది. మేం ఇద్దరం కలిసి తిరగని ప్రాంతం లేదు. షాపింగ్‌, సినిమాలు ఇలా కలిసే తిరిగేవాళ్లం. మా అమ్మ చనిపోయినప్పుడు ..నవ్య నాకు కాల్‌ చేసి ఇప్పట్నుంచి నేనే మీ అమ్మనంది. మాటల వరకే కాదు, నిజంగానే తను నన్ను అమ్మలా చూసుకుంది. అమ్మలేని బాధను దూరం చేయడానికి నన్నెంతో ప్రేమగా చూసుకునేది. నాకు ఇష్టమైనవన్నీ తనే స్వయంగా వండిపెట్టేది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఆ ప్రేమతోనే ఇద్దరం రహస్యంగా గుళ్లో పెళ్లి చేసుకున్నాం.

ఆ తర్వాత అంతా బాగానే ఉందనుకుంటున్న టైంలో మా విషయం వాళ్లింట్లో తెలిసింది. తనను ఏం చేశారో, ఏం మాయమాటలు చెప్పారో తెలీదు కానీ 10 రోజుల్లోనే నన్ను వదిలేసింది. నాతో మాట్లాడటం లేదు. నా నెంబర్‌ బ్లాక్‌ చేసింది. నా మీద పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ కేసు పెట్టారు. నా తప్పేంటో నాకే తెలియడం లేదు. ఇదంతా తనతో ఎందుకు చేయిస్తున్నారో తెలియడం లేదు. అసలు వాళ్లింట్లో తనను ఎంత బాధపెడుతున్నారో అని భయంగా ఉంది. ఏ తప్పు చేయని నాపై తప్పుడు కేసులు పెట్టారు. సరే తను నాతో సంతోషంగా ఉండదని వాళ్ల పేరేంట్స్‌ ఎలా డిసైడ్‌ చేస్తారు? మరి తనకు సంబంధాలు చూసి ఆ అబ్బాయితో సంతోషంగా ఉంటుందని వాళ్లు నాకు హామీ ఇవ్వగలరా? వాళ్ల పేరేంట్స్‌ ఆడిన నాటకంలో మేం ఇద్దరం బలిపశువులమయ్యాం.
- రాజు (రాజమండ్రి)

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top