వయసు 99, తొమ్మిది రోజుల్లోనే రికవరీ

99 Year Old Woman Recovered From Coronavirus In Bangalore - Sakshi

బెంగుళూరు: మహమ్మారి కరోనా నుంచి కోలుకుని ఓ 99 ఏళ్ల పెద్దావిడ రికార్డు సృష్టించారు. బెంగుళూరుకు చెందిన బామ్మ తన మనవడితో కాంటాక్ట్‌ అవడం వల్ల కరోనా బారినపడ్డారు. వారిద్దరు నగరంలోని విక్టోరియా ప్రభుత్వాస్పత్రిలో జూన్‌ 18న చేరారు. తొమ్మిది రోజుల్లోనే తన మనవడితోపాటు ఆమే కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక కోవిడ్‌ సోకి అదే ఆస్పత్రిలో చేరిన బామ్మ కొడుకు, కోడలు చికిత్స పొందుతున్నారు. తమ కుటుంబానికి కరోనా ఎలా సోకిందో ఇప్పటికీ అంతుబట్టం లేదని వృద్ధురాలి కొడుకు అన్నారు.
(చదవండి: జూలై 5 తరువాత లాక్‌డౌన్‌?)

అయితే, మార్కెట్‌ వెళ్లి ఇంట్లోకి సరుకులు తీసుకొచ్చే తమ కుమారుడి (29)తో కరోనా వ్యాప్తి జరగొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వయసులో పెద్దవారైన తన తల్లి కోవిడ్‌ నుంచి కోలుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తమ ముగ్గురికీ లక్షణాలు బయటపడగా ఆమెకు ఎలాంటి లక్షణాలు కనబడలేదని తెలిపారు. కాగా, కర్ణాటకలో కరోనా నుంచి కోలుకున్న అత్యంత వృద్ధురాలిగా ఆమె నిలిచారు. పుట్టినరోజు నాడే ఆమె ఆస్పత్రిలో చేరడం విశేషం. తొలుత ఆ బామ్మ చికిత్సకు నిరాకరించారని, అయితే, ఆమె నచ్చజెప్పి చికిత్స అందించామని విక్టోరియా వైద్యులు తెలిపారు. బామ్మ పాజిటివ్‌ దృక్పథమే వైరస్‌ నుంచి త్వరగా కోలుకునేలా చేసిందని అన్నారు.
(చదవండి: ‘వారి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’)

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top