పెంపుడు కుక్కను పెళ్లాడిన మహిళ | woman 'marries' pet dog | Sakshi
Sakshi News home page

పెంపుడు కుక్కను పెళ్లాడిన మహిళ

Mar 10 2014 2:52 PM | Updated on Sep 2 2018 3:30 PM

పెంపుడు కుక్కను పెళ్లాడిన మహిళ - Sakshi

పెంపుడు కుక్కను పెళ్లాడిన మహిళ

ఇంగ్లండ్కు చెందిన ఓ మహిళ అందరికీ భిన్నమైన దారి ఎంచుకుంది. ఆమెకు మనుషులు ఎవరూ నచ్చలేదోమో కానీ ఏకంగా పెంపుడు కుక్కను పెళ్లి(!) చేసుకుంది.

లండన్: అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకోవడం పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఇటీవల కాలంలో్ యువత ఓ అడుగు ముందుకేసి అమ్మాయిలు అమ్మాయిలతో.. అబ్బాయిలు అబ్బాయిలతో వివాహం చేసుకుంటున్నారు. ఇంగ్లండ్కు చెందిన ఓ మహిళ అందరికీ భిన్నమైన దారి ఎంచుకుంది. ఆమెకు మనుషులు ఎవరూ నచ్చక ఏకంగా పెంపుడు కుక్కను పెళ్లి(!) చేసుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజమే!

లండన్కు చెందిన 47 ఏళ్ల అమండా రోడ్జర్స్.. భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమె ఓ కుక్కను అపురూపంగా పెంచుకుంటోంది. ముద్దుగా షెబా అనే పేరు పెట్టింది. అంతవరకు బాగానే ఉంది. జీవిత భాగస్వామిలో ఉండాల్సిన లక్షణాలన్నీ అమండాకు పెంపుడు కుక్కులో కనిపించాయి. ఇంకేముందు ఆలస్యంగా చేయకుండా కుక్కను పెళ్లి చేసేసుకుంది. 200 మందిని ఆహ్వానించి ఈ వేడుక చేసుకుంది. 2012 ఆగస్టులో ఈ పెళ్లి జరిగినట్టు సమాచారం. 'గత కొన్నేళ్లుగా షెబా నా జీవితంలో భాగమైపోయింది. నన్నెప్పుడు సంతోషంగా, సౌకర్యంగా ఉంచుతుంది. జీవిత భాగస్వామి నుంచి నాకేమి కావాలో..  ఇంతకుమించి మరేమీ అవసరం లేదు' అని అమండా సంతోషం వ్యక్తం చేసింది. అన్నట్టు ఆమె 20 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే కొన్ని నెలల్లోనే పెళ్లి తెగదెంపులు చేసుకుంది. మాజీ భర్తతో పోలిస్తే కుక్కతోనే ఎక్కువ రోజులు సంసారం చేసింది. ఇప్పటికీ సాగిస్తోంది. ఎవరి ఆనందం వారిదండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement