ఐర్లాండ్‌లో అండర్‌వేర్‌ ఉద్యమం.!

Why Women Around The World Are Sharing Underwear Pics - Sakshi

డబ్లిన్‌ : అండర్‌వేర్‌ ఉద్యమం ఇప్పుడు ఐర్లాండ్‌ను కుదిపేస్తోంది. ThisIsNotConsent... అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆ దేశ మహిళలు అండర్‌వేర్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఓ 17 ఏళ్ల అమ్మాయిపై జరిగిన అఘాయిత్యాన్ని నిలదీస్తున్నారు. ఇటీవ‌ల కార్క్ అనే ప‌ట్ట‌ణంలో ఓ 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి అత్యాచారానికి గురైంది. ఈ కేసులో నిందితుడైన 27 ఏళ్ల వ్య‌క్తిని న్యాయస్థానం నిర్ధోషిగా ప్ర‌క‌టించింది. అయితే ఈ కేసు విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో.. ఢిఫెన్స్‌ లాయ‌ర్.. మహిళలు వేసుకునే అండర్‌వేర్‌ను చూపిస్తూ.. ‘ఈ అమ్మాయి ఎలాంటి దుస్తులు వేసుకుందో చూడండి. ఇలాంటి దుస్తులతోనే ఆమె అతన్ని అకర్షించే ప్రయత్నం చేసింది’ అని వాదించారు.

ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఎంతటి దుమారం అంటే ఆ దేశ మహిళా ఎంపీ రూత్‌ కాపింజ‌ర్‌ స్వయంగా పార్లమెంట్‌లో అండర్‌వేర్‌ ప్రదర్శిస్తూ నిరసన తెలిపేంతా.. ఆమె స్పూర్తితో ఆ దేశ మహిళా లోకం కదిలింది. ‘ఎలాంటి అండర్ వేర్ వేసుకుంటే ఏంటీ..? అలాంటి లోదుస్తులు వేసుకున్నంత మాత్రానా శృంగారానికి సమ్మతి తెలిపినట్టు కాదు కదా? అని ప్రశ్నిస్తూ భగ్గుమన్నారు. వారికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ ఘటనతో మహిళలు వేసుకునే దుస్తుల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top