కవలలే భార్యాభర్తలు! | Twins Get Married in Washington | Sakshi
Sakshi News home page

కవలలే భార్యాభర్తలు!

Apr 17 2017 1:59 AM | Updated on Apr 4 2019 4:44 PM

కవలలే భార్యాభర్తలు! - Sakshi

కవలలే భార్యాభర్తలు!

కొన్నాళ్ల కిందట అమెరికాలో ఓ జంట వివాహమాడింది. సంతానం కలగకపోవడంతో వారు ఐవీఎఫ్‌ కేంద్రాన్ని ఆశ్రయించారు.

వాషింగ్టన్‌: కొన్నాళ్ల కిందట అమెరికాలో ఓ జంట వివాహమాడింది. సంతానం కలగకపోవడంతో వారు ఐవీఎఫ్‌ కేంద్రాన్ని ఆశ్రయించారు. కానీ అక్కడే వారిని నిర్ఘాంతపరిచే విషయం తెలిసింది. వారివురూ కవలలు అని వైద్యులు చెప్పడంతో ఆశ్చర్యానికి లోన య్యారు. ‘వారివురి డీఎన్‌ఏ నమూనాలను చూసి ఆశ్చర్యపోయాను.

ఇద్దరి డీఎన్‌ఏలు ఒకే విధంగా ఉన్నాయి. ముందుగా వీరివురికి దగ్గరి బాంధవ్యం ఉండొచ్చని భావించా. ఆ తర్వాత వారి పుట్టిన తేదీలు ఒకే రోజు కావడంతో నిర్ఘాంతపోయాను. డీఎన్‌ఏలను క్షుణ్నంగా పరీక్షించి వారిద్దరు కవలలు అని నిర్ధారణకు వచ్చాను’ అని డీఎన్‌ఏ పరీక్ష చేసిన డాక్టర్‌ హెరాల్డ్‌ చెప్పారు. అయితే నిజానికి వీరు చిన్నతనంలోనే ఓ రోడ్డు ప్రమాదంలో తమ తల్లిదండ్రులను కోల్పోయారు. ఆ తర్వాత వీరిద్దరిని వేర్వేరు కుటుంబాలు దత్తత తీసుకున్నాయని డాక్టర్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement