నన్ను సంతృప్తిపరచడానికే ఒప్పందం | Trump says India wants trade deal with America primarily to keep him happy | Sakshi
Sakshi News home page

నన్ను సంతృప్తిపరచడానికే ఒప్పందం

Oct 2 2018 4:32 AM | Updated on Oct 2 2018 4:32 AM

Trump says India wants trade deal with America primarily to keep him happy - Sakshi

డొనాల్డ్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌: తనను సంతృప్తిపరచడానికే భారత్‌ అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించినందుకు భారత్‌పై మండిపడ్డారు. సుంకాల పెంపునకు సంబంధించి ట్రంప్‌ భారత్‌ను విమర్శించడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి కావడం గమనార్హం.  ఈ సందర్భంగా శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడుతూ జపాన్, యూరోపియన్‌ యూనియన్, చైనా, భారత్‌లతో కూడా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న భారత్‌ను ‘టారిఫ్‌ కింగ్‌’గా పేర్కొన్న ట్రంప్‌ హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌లపై పెంచిన సుంకాలను ప్రస్తావించారు. సుంకాలు తగ్గిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చినా, అవి ఇంకా అధికంగానే ఉన్నాయని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement