అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య | Telugu person killed in america | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య

Jan 3 2015 5:13 PM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య - Sakshi

అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య

అమెరికాలో దారుణం జరిగింది. దొంగల చేతిలో తెలుగు వ్యక్తి హత్యకు గురయ్యారు.

న్యూయార్క్: అమెరికాలో దారుణం జరిగింది. దొంగల చేతిలో తెలుగు వ్యక్తి హత్యకు గురయ్యారు. కృష్ణా జిల్లా ఘంటసాల మం
డలం చిట్టూర్పుకు చెందిన పరుచూరి బాలగోపాల్ అనే వ్యక్తి సౌత్ కరోలినా మెరిడియన్ బీచ్ ప్రాంతంలో గ్యాస్ స్టేషన్ నిర్వహిస్తున్నారు.  

దొంగతనానికి వచ్చిన కొందరు బాలగోపాల్పై దాడి చేశాడు. దొంగలు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన బాలగోపాల్ అక్కడికక్కడే మరణించారు. బాలగోపాల్ స్నేహితులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు, ఆంధ్రప్రదేశ్లోని ఆయన బంధువులకు తెలిపారు. మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు సహాయం చేయాలని అధికారులను కోరారు. దుండగుడు డబ్బుల కోసమే హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

బాలగోపాల్కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాలగోపాల్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా అమెరికాలో ఉన్నారు. బాలగోపాల్ తల్లిదండ్రులు, బంధువులు విజయవాడలో ఉంటున్నారు. బాలగోపాల్ హత్య వార్త తెలియడంతో చిట్టూర్పు, విజయవాడలో విషాదం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement