వాతావరణం బాగోలేదు.. బస్సులో వెళ్లండి | Take The Bus: This Flight Landed Mid-Way, Forced Passengers Out | Sakshi
Sakshi News home page

వాతావరణం బాగోలేదు.. బస్సులో వెళ్లండి

Nov 5 2017 2:47 AM | Updated on Mar 23 2019 8:28 PM

Take The Bus: This Flight Landed Mid-Way, Forced Passengers Out - Sakshi

లాహోర్‌: తక్కువ వెలుతురు కారణంగా తమ ప్రాంతాలకు బస్సులో వెళ్లాలని ప్రయాణికులకు పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ) షాకిచ్చింది. పీఐఏకు చెందిన విమానం అబుదాబి నుంచి పాక్‌లోని రహిమ్‌ యార్‌ ఖాన్‌కు వెళ్లాల్సి ఉంది.  వాతావరణంలో తక్కువ వెలుతురు కారణంగా లాహోర్‌లో ల్యాండ్‌ చేశారు. రహిమ్‌ యార్‌కు బస్సులో వెళ్లాలని పీఐఏ కోరింది. దీనికి నిరాకరించిన ప్రయాణికులు విమానంలోనే కూర్చోవడంతో ఏసీని ఆఫ్‌ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాహోర్‌ నుంచి రహిమ్‌ యార్‌ మధ్య దూరం 624.5 కి.మీ. కనీసం ముల్తాన్‌ ఎయిర్‌పోర్ట్‌లోనైనా తమను విమానంలో దింపాలని కోరారు. ముల్తాన్‌ నుంచి 292 కి.మీ. దూరంలో రహిమ్‌ యార్‌ ఎయిర్‌పోర్ట్‌ ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement