వణికిపోతున్న అగ్రరాజ్యం

Snow Storm in New Jersey  - Sakshi

అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో ఉష్ట్రోగ్రతలు విపరీతంగా పడిపోవడం, తీవ్రంగా మంచు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా మంచు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. న్యూయార్క్‌లో 6 నుంచి 10 అంగుళాలు, న్యూజెర్సీ, కనెక్టికట్‌లలో 20 అంగుళాల మేర మంచు పేరుకుపోయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు తుపానుతో పాటు బలమైన గాలులు కూడా వీస్తుండటంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గాలుల నేపథ్యంలో పలు ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.  దాదాపు లక్ష ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

విమానాల రద్దు
మంచు తుపాను కారణంగా విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే న్యూయార్క్‌, న్యూజెర్సీ ఎయిర్‌ పోర్టుల్లో వేల సంఖ్యలో విమానాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దాదాపు 2600 విమానాలు రద్దు అయినట్టు అధికారులు తెలిపారు.  దీంతో ఆయా ప్రయాణికులంతా ఎయిర్‌పోర్టుల్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల అవసరాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top