ఉడుతా ఉడుతా ఊచ్.. ఫొటో తీస్తానోచ్.. | snaps amazing photos of squirrels | Sakshi
Sakshi News home page

ఉడుతా ఉడుతా ఊచ్.. ఫొటో తీస్తానోచ్..

Mar 11 2015 12:54 AM | Updated on Sep 2 2017 10:36 PM

ఉడుతా ఉడుతా ఊచ్.. ఫొటో తీస్తానోచ్..

ఉడుతా ఉడుతా ఊచ్.. ఫొటో తీస్తానోచ్..

ఈ ఉడుతలను చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోంది కదూ! అందుకే ఫొటోగ్రాఫర్ వాదిమ్ ట్రునావ్ సరదా పడి వాటికో పరీక్ష పెట్టాడులెండి!!

ఈ ఉడుతలను చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోంది కదూ! అందుకే ఫొటోగ్రాఫర్ వాదిమ్ ట్రునావ్ సరదా పడి వాటికో పరీక్ష పెట్టాడులెండి!! ఓ మంచు ముద్ద, కెమెరాను పెట్టి మరో కెమెరాతో నిఘా పెట్టాడు. గెంతులేస్తూ వచ్చిన ఈ బుజ్జి ఉడుతలు హఠాత్తుగా వాటిని చూసి అక్కడే ఆగిపోయాయి.

ఇంకేముంది.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టయింది. తమ తెలివిని ప్రదర్శించడానికి పోటీపడ్డాయి. ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఫొటోలకు పోజులిచ్చాయి. ఇంతకీ ఎక్కడో చెప్పనేలేదు కదా.. రష్యాలోని అటవీప్రాంతం వొరోనెజ్‌లో ఇలాంటి ఉడుతలు బోలెడు కనిపిస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement