‘డీఏసీఏ’లో ట్రంప్‌కు ఎదురుదెబ్బ  | Shock to trump in DACA | Sakshi
Sakshi News home page

‘డీఏసీఏ’లో ట్రంప్‌కు ఎదురుదెబ్బ 

Feb 27 2018 3:27 AM | Updated on Apr 4 2019 5:04 PM

Shock to trump in DACA - Sakshi

వాషింగ్టన్‌: డీఏసీఏ (బాల్యంలో వచ్చిన వారిపై చర్యల వాయిదా) పథకానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ పిటిషన్‌ను విచారించేందుకు న్యాయమూర్తులు నిరాకరించారు. కింది కోర్టులు పరిశీలించిన తర్వాతనే తాము విచారిస్తామని జడ్జీలు పేర్కొన్నారు.

చిన్నప్పుడే తల్లిదండ్రులతోపాటు అమెరికా వచ్చి, అక్కడే అక్రమంగా స్థిరపడిపోయిన వారిని స్వాప్నికులు(డ్రీమర్స్‌) అంటారు. వీరు దాదాపు 7 లక్షల మంది ఉంటారు. వీరందరూ అమెరికాలోనే నివసించేందుకు అనుమతులిస్తూ మాజీ అధ్యక్షుడు ఒబామా తీసుకొచ్చిన పథకమే డీఏసీఏ. దీన్ని రద్దు చేయాలని ట్రంప్‌ చూస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement