డ్రగ్స్ ఇచ్చి 100 మందిపై అత్యాచారం! | Over 100 drugged and raped in Japan fake clinical study | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ ఇచ్చి 100 మందిపై అత్యాచారం!

Feb 3 2015 4:34 PM | Updated on Jul 28 2018 8:44 PM

డ్రగ్స్ ఇచ్చి 100 మందిపై అత్యాచారం! - Sakshi

డ్రగ్స్ ఇచ్చి 100 మందిపై అత్యాచారం!

మహిళలకు ఎక్కడా రక్షణ లేదనేది ఈ తాజా ఉదంతంతో మరోసారి రుజువైంది.

టోక్యో: మహిళలకు ఎక్కడా రక్షణ లేదనేది ఈ తాజా ఉదంతంతో మరోసారి రుజువైంది. ఒక  క్లినికల్ స్టడీ సెంటర్ లో వాలంటీర్లగా పని చేయడానికి జాయిన్ అయిన 100 మందికి పైగా మహిళలకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఘటన జపాన్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ మహిళలు వైద్య విద్యలో భాగంగా  2011వ సంవత్సరంలో ఒక స్టడీ సెంటర్ లో జాయిన్ అయ్యారు. అయితే  వారు నిద్రిస్తున్న సమయంలో డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేయడం అక్కడ పరిపాటిగా మారిపోయింది.  ఆ మహిళలు 2013 నవంబర్ వరకూ ఆ సెంటర్ లో వాలంటరీ విధులు నిర్వర్తించారు. కాగా వారిపై అత్యాచారం జరిగినట్లు తాజాగా ఒక వీడియో బయటకి రావడంతో కలకలం రేగింది.

 

ఆ వీడియోలను ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడమే కాకుండా.. కొంతమంది నీలి చిత్రాలు తీసే నిర్మాతలకు విక్రయించినట్లు పోలీసు విచారణలో తేలింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  అది అసలు క్లినిక్ స్టడీ సెంటర్ కాదని.. నకిలీ స్టడీ అని పోలీసులు తేల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement