యూఎన్‌ సిబ్బందికీ లైంగిక వేధింపులు: నివేదిక  | Molestation Harassment to UN Staff According to a report | Sakshi
Sakshi News home page

యూఎన్‌ సిబ్బందికీ లైంగిక వేధింపులు: నివేదిక 

Jan 17 2019 2:33 AM | Updated on Jan 17 2019 2:33 AM

Molestation Harassment to UN Staff According to a report   - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

యునైటెడ్‌ నేషన్స్‌: ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్న సిబ్బందిలో ప్రతి ముగ్గురిలో ఒకరు గడిచిన రెండేళ్లలో ఏదో ఒకసారి లైంగిక వేధింపులకు గురైనట్లు ఓ నివేదికలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ఐరాసకు చెందిన 31 సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది అభిప్రాయాలు తీసుకుని ఈ సర్వే నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారిలో సుమారు 33 శాతం ఈ రెండేళ్లలో ఏదో ఒక సందర్భంలో లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపారు. ప్రతి ఐదుగురిలో ఒకరు 2016 కు ముందు ఏదో ఒకరకమైన లైంగిక వేధింపులు అనుభవించామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement