పూడ్చిపెట్టాక..బిడ్డకు జన్మ ఇచ్చింది

A Medieval Woman Gave Birth After She was Buried - Sakshi

రోమ్‌ : ఇటలీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు ఓ అధ్భుత విషయాన్ని వెలికితీశారు. చనిపోయిన తర్వాత ఓ తల్లి బిడ్డకు జన్మనిచ్చినట్లుగా ఉన్న ఆనవాళ్లను గుర్తించారు. మధ్య యుగ కాలానికి చెందిన 25 ఏళ్ల యువతి గర్భంతో ఉండగానే చనిపోయింది. దీంతో ఆమెను సమాధి చేశారు. ఈ ఘటన అనంతరం తల్లి దేహం నుంచి బిడ్డ జన్మించినట్లుగా ఉన్న అవశేషాలను పురా నిపుణులు కనుగొన్నారు.

మరణించిన యువతి పుర్రెకు పెద్ద రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. దాన్ని బట్టి ఆమెకు మెదడు సంబంధిత వైద్యం జరిగినట్లు భావిస్తున్నారు. ఫెరారా, బోలోగ్నా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వరల్డ్ న్యూరో సర్జరీ అనే మ్యాగజైన్‌లో ఈ విషయాలను ప్రచురించారు. క్రీస్తు పూర్వం 7 లేదా 8 శతాబ్దానికి చెందిన మహిళ అత్యంత అరుదైన మెదడు సంబంధిత వ్యాధికి గురైనట్లు పేర్కొన్నారు.

దాంతో 38 వారాల నిండు గర్భిణీ అయిన ఆమెకు వైద్యం చేశారని చెప్పారు. గర్భధారణ జరిగి 20 వారాల తర్వాత సంభవించే ఆ వ్యాధి కారణంగా శరీరంలో రక్తపోటు అధికం అవుతుందని వివరించారు. వ్యాధి నివారణకు మరో మార్గం లేకపోవడంతో బలవంతపు ప్రసవానికి అప్పటి వైద్యులు యత్నించగా.. సదరు మహిళ మరణించిందని వివరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top