నింగినంటిన భర్త ప్రేమ.. ఆరు గంటల పాటు

Man Stands For 6 Hours In Flight For His Wife Sleep - Sakshi

భార్య కోసం ఆరు గంటలపాటు విమానంలో నిల్చునే ప్రయాణం

లండన్‌: ప్రేమ సాంద్రతను కొలవడం ఎలా అంటే చెప్పడం కష్టం కానీ.. కొన్ని సంఘటనలు, సందర్భాలు, త్యాగాలు చూసి ప్రేమను బేరీజు వేసుకోవచ్చు. ఏ భర్త అయినా తన భార్యపై ప్రతీక్షణం ప్రేమ కురిపించాలని ఆరాటపడుతుంటాడు. ఏ కష్టం రాకుండా చూసుకోవాలని.. ప్రతీ పనిలో చేదోడువాదోడుగా ఉండాలని.. భార్యను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని అనుకుంటాడు. తాజాగా ఓ వ్యక్తి భార్యపై చూపించిన ప్రేమ నెటిజన్లను ఫిదా చేస్తోంది. యూకే విమానంలో ప్రయానిస్తున్న ఓ వ్యక్తి తన భార్య కోసం ఏకంగా ఆరు గంటలపాటు నిల్చునే ప్రయాణం చేశాడు.


తన భార్యకు నిద్ర వస్తోందని గమనించిన భర్త.. తన సీటును కూడా భార్యకిచ్చి పడుకోబెట్టాడు. ఆమె లేచే వరకు ఏకంగా ఆరు గంటల పాటు అలాగే నిల్చుని ప్రయాణం చేశాడు. భర్త చేసిన త్యాగాన్ని పక్క ప్రయాణికుడు ఫోటో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీనిపై నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ‘భార్యాభర్త గొప్ప ప్రేమ​‍’ అంటూ కొంతమంది ప్రశంసలు కురిపిస్తుంటే మరికొంత మంది దీనికి భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. భార్యకు అతను బానిసగా మారాడని, ఆమెకు భయపడి కనీసం పక్క సీట్లో కూడా కూర్చోలేక పోతున్నాడని పోస్ట్‌లు పెడుతున్నారు. కొందరైతే భార్య శాడిజం అంటూ తిట్ల దండకం మొదలుపెట్టారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top