ఆఫ్ఘనిస్థాన్లో అరెస్ట్ చేసిన తాలిబన్ టాప్ మిలిటెంట్ కమాండర్ లతీఫ్ మషూద్తో పాటు మరో ఇద్దరిని పాకిస్థాన్కు అప్పగించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
పెషావర్: ఆఫ్ఘనిస్థాన్లో అరెస్ట్ చేసిన తాలిబన్ టాప్ మిలిటెంట్ కమాండర్ లతీఫ్ మషూద్తో పాటు మరో ఇద్దరిని పాకిస్థాన్కు అప్పగించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తాలిబన్ కార్యక్రమాల్లో మాజీ చీఫ్ హకీముల్లా మషూద్ తర్వాత లతీఫ్ది రెండో స్థానం.
లతీఫ్ ఆయుధాలు కొనడానికి ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్ వెళ్తుండగా, సరిహద్దుల్లో ఆప్ఘన్ దళాలు అతన్ని అరెస్ట్ చేశాయి. లతీఫ్ కొంతకాలంగా ఆఫ్ఘనిస్థాన్, నాటో దళాల అదుపులో ఉన్నాడు. పాక్ కోరిక మేరకు అతన్ని అప్పగించినట్టు వార్తలు వచ్చాయి.