ఈ లక్షణాలు మీకుంటే మీరు మేధావే..! | if you have these qualities You may be a genuis | Sakshi
Sakshi News home page

ఈ లక్షణాలు మీకుంటే మీరు మేధావే..!

Jun 29 2016 12:40 PM | Updated on Sep 4 2017 3:43 AM

ఈ లక్షణాలు మీకుంటే మీరు మేధావే..!

ఈ లక్షణాలు మీకుంటే మీరు మేధావే..!

ఇంతకీ మేధావి అంటే ఎవరు? అసలు అతడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? మేధావి గురించే మాట్లాడుకునే వారిలో మేధావి లక్షణాలు లేవా.. మేధావి కావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి?

మేధావి అనే మాట వినగానే ముఖం అలా వెలిగిపోతుంది. ఓ మేధావి గురించి మాట్లాడినా, చెప్పినా, లేదా అతడిని చూసినా ఓ రకమైన సంతోషం కలుగుతుంది. ఇంతకీ మేధావి అంటే ఎవరు? అసలు అతడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? మేధావి గురించే మాట్లాడుకునే వారిలో మేధావి లక్షణాలు లేవా.. మేధావి కావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే అంశంపై బ్రిటన్కు చెందిన ఓ అధ్యయనం కొన్ని వివరాలు వెల్లడించింది. ముఖ్యంగా ఈ ఐదు లక్షణాలు ఉంటే మాత్రం మేధావేనట. ఆ లక్షణాలేమిటో ఒకసారి పరిశీలిస్తే..
1. ప్రతి విషయం గురించి అమితమైన ఆసక్తి
ఒకే అంశానికి పరిమితం కాకుండా నిరంతరం భిన్న విషయాలను పఠించి వాటిని నేర్చుకోవడం మేధావి లక్షణం. జీనియస్లంతా ఇలాగే చేస్తారట.

2.మీలో మీరు మాట్లాడుకోవడం
సాధారణంగా కొంతమంది వ్యక్తులు తమలో తాము మాట్లాడుకుంటుంటారు. అప్పుడప్పుడు ఆ మాటలు బయటకు కూడా వినిపిస్తాయి. వారిని చూసి కొంతమంది నవ్వుకుంటారు కూడా. అయితే, అలా మాట్లాడుకునేవారు అస్సలు సిగ్గుపడొద్దట. ఎందుకంటే మేధావులు అలాగే చేస్తారని అధ్యయనం చెబుతోంది.

3.పుస్తకాల పురుగు
సాధారణంగా ఎవరైతే నిత్యం పుస్తకాల్లో మునిగి ఉంటారో వారంతా జీనియస్ అంట. వారు పిచ్చిపట్టిన వారిలా పుస్తకాలు చదువుతూ కనిపిస్తారట.

4.కష్టాలతో ఎంజాయ్
మేధావులు కష్టాలను సవాలుగా తీసుకుని, వాటిని సొంత తెలివితేటలతో పరిష్కరించుకొని ఆనందంగా గడిపేస్తారంట.

5.తప్పులు క్షమించి మర్చిపోగలిగే తీరు
సాధారణంగా మేధావులు తప్పు చేసిన వారిని క్షమిస్తారట. అసలు ఆ విషయాలను అంతపెద్దగా పట్టించుకోరంట. ఒక వేళ ఎవరైనా ఆ తప్పులను గుర్తు చేస్తే ఎప్పుడు? అవునా అంటూ జీనియస్లు ప్రతిస్పందిస్తారంట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement