
సాధారణంగా పజిల్స్ అంటే ఇష్టపడని వారుండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చిక్కు ప్రశ్నలను పూరించడానికి ఆసక్తి చూపుతారు. ఇక పేపర్‌లో సండే మ్యాగజన్, ఫన్‌డే బుక్స్‌లో పజిల్స్ కనిపిస్తే చాలు చాలా మంది వాటికే అతక్కుపోతారు. అయితే అలాంటి వారికి కోసం పిల్లల పుస్తక రచయిత గెర్గ్లీ దుడాస్ ఇటీవల గీసిన స్కేచ్‌ను బుధవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. మొత్తం పచ్చని ఆకులతో నిండి ఉన్న ఈ స్కేచ్‌లో పాము కనిపెట్టాలంటూ నెటిజన్ల మెదడుకు పదును పెట్టారు. (కొంచెం పట్టు తప్పినా ప్రాణాలు దక్కవు)
ఆకుల పొదలుతో తో గజిబిజిగా గీసిన దుడాస్ స్కేచ్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఈ పోదల్లో మీకు పాము కనిపించందా?’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ పోస్టుకు ఇప్పటి వరకు వందల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వచ్చాయి. ఈ స్కేచ్‌లో పచ్చని ఆకులు, పిచ్చుకలు, రామచిలుకలు వంకలు తిరుగుతూ ఉన్న చెట్ల తిగలతో గజిబిజిగా ఉన్న ఈ ఫొటోలో నెటిజన్లు పామును కనిపెట్టడం నెటిజన్లకు సవాలుగా ఉంది. ‘బాబోయ్ ఇందులో పామును కనిపెట్టడం చాలా కష్టంగా ఉంది’’, చాలా కష్టంగా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.