
రెండు గంటలకు మించి ఫేస్‌బుక్ చూడకండి
ఈ కాలంలో ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్‌ఫోన్లు కనబడడం సర్వసాధారణం.
టొరంటో: ఈ కాలంలో ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్‌ఫోన్లు కనబడడం సర్వసాధారణం. ముఖ్యంగా ఈ కాలపు పిల్లలు అవుట్‌డోర్ గేమ్స్ కంటే మొబైల్‌లోనే ఆటలు ఆడుతున్నారు. ఈ క్రమంలో సామజిక మాధ్యమ సైట్ లైన ఫేస్‌బుక్, ట్వీటర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిని రోజులో ఎక్కువ సేపు చూస్తూ గడుపుతున్నారు. ఇలా రోజుకు రెండు గంటలకు మించి ఈ సైట్లను చూస్తే పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు కెనడా పరిశోధకులు.
అంతేగాక మానసిక క్షోభ, ఆత్యహత్య ఆలోచనలు పెరుగుతున్నట్లు ఓ ఆధ్యయనంలో తేలినట్లు వారు తెలిపారు. కెనడాలోని ఒట్టావా పబ్లిక్ హెల్త్ పరిశోధకులు నిర్వహించిన ఓ సర్వేలో 25 శాతం మంది రోజుకు దాదాపు రెండు గంటలకు మించి సామాజిక మాధ్యమ సైట్లను చూస్తున్నామని తెలిపారు. ఈ పరిశోధనలో వెల్లడైన అంశాల ఆధారంగా పిల్లల్లో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలపై దృష్టి సారించాలని తల్లిదండ్రులకు పరిశోధకులు సూచిస్తున్నారు.