భూమి నుంచి 46 అడుగుల ఎత్తులో...

Eastern German Couple Married In Tightrope Wedding - Sakshi

బెర్లిన్‌ : ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహమనేది ఓ మధుర ఙ్ఞాపకం. అలాంటి క్షణాలను రొటీన్‌గా కాకుండా సమ్‌థింగ్‌ స్పెషల్‌గా చేసుకోవాలని కొందరు కోరుకుంటుంటారు. తూర్పు జర్మనీకి చెందిన నికోల్‌ బెకాస్‌, జెన్స్‌ నార్‌లు ఆ కోవకు చెందినవాళ్లే.  అందుకే తమ వివాహాన్ని వెరైటీగా ఫ్లాన్‌ చేశారు. అనుకున్నదే తడవుగా.. టైట్‌రోప్‌ ఆర్టిస్ట్‌ను సంప్రదించి తమ ఆలోచనను పంచుకు​న్నారు. అతడి సాయం, ఆలోచనతో భూమి నుంచి 46 అడుగుల ఎత్తులో ఒక్కటయ్యారు. 

ఓ తాడుపై టైట్‌రోప్‌ ఆర్టిస్ట్‌ మోటార్‌ సైకిల్‌ నడుపుతుంటే.. దానికి కట్టిన తాడుకు కింద ఓ ఊయల కట్టారు. అందులో కూర్చున్న వాళ్లు ఉంగరాలు మార్చుకున్నారు. భూమి- ఆకాశాల మధ్య వివాహ బంధంతో ఒక్కటై అందరి దృష్టిని ఆకర్షించారు. విశేషమేమిటంటే పాస్టర్‌ కూడా నిచ్చెన సాయంతో గాల్లో నిలబడి వీరితో పెళ్లి ప్రమాణాలు చేయించారు. ఇలా తమకు నచ్చిన రీతిలో పెళ్లి చేసుకున్న నికోల్‌ బెకాస్‌, జెన్స్‌ నార్‌లు...ఆ మధుర ఙ్ఞాపకాలను ‘లైఫ్‌ ఆల్బం’లో పొందుపరచుకున్నారు. 3 వేల మంది ఈ వేడుకకు హాజరయినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top