
నీళ్లు ఎక్కువగా తాగడం ప్రాణాంతకం!
ఆరోగ్యం కోసం నీళ్లు ఎక్కువ తాగాలంటారు. ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్సిటీ పరిశోధకులు మాత్రం నీళ్లు ఎక్కువగా తాగడమనేది ప్రాణాంతకమైన చర్య అని హెచ్చరిస్తున్నారు.
మెల్‌బోర్న్: ఆరోగ్యం కోసం నీళ్లు ఎక్కువ తాగాలంటారు. ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్సిటీ పరిశోధకులు మాత్రం నీళ్లు ఎక్కువగా తాగడమనేది ప్రాణాంతకమైన చర్య అని హెచ్చరిస్తున్నారు. చరిత్రలో తొలిసారిగా, శరీరంలో ద్రవపదార్థాల నియంత్రణ యంత్రాంగం పనితీరును విశ్లేషిం చారు. పరిశోధకులు కొంతమందిని రెండు సందర్భాల్లో నీళ్లు తాగమన్నారు. వాటిలో ఒకటి వ్యాయామం అనంతరం దాహంగా ఉన్నపుడు, రెండోది దాహం లేకపోయి నా వేరెవరైనా వాళ్లను నీళ్లు ఎక్కువగా తాగడానికి ఒప్పిం చినపుడు. మొదటి దాని కన్నా రెండో సందర్భంలో వారు నీళ్లు తాగడానికి మూడింతలు ఎక్కువ కష్టపడ్డారు.