ఎస్‌సూజ్‌ మీ.. ఈ బార్‌కు మందెక్కువైందా మాస్టారూ..

Crooked House Bar in Dudley, UK - Sakshi

మందుబాబులూ.. ఒక్క పెగ్గుకే మీకు కిక్కెక్కాలా.. అయితే.. బ్రిటన్‌లోని డడ్లీలో ఉన్న క్రూక్డ్‌ హౌస్‌ బార్‌కు వెళ్లండి.. ఎందుకంటే.. అక్కడ ఒక్క పెగ్గుకే.. నిజంగా చెప్పాలంటే.. ఏమీ తాగకున్నా.. మీరు తూలుతారు.. ఎందుకంటే.. ఈ బారే కాస్త మందేసి.. తూలుతున్నట్లు ఉంటుంది మరి.. నమ్మడం లేదా.. ఓసారి ఫొటోను చూడండి.. కుడివైపుతో పోలిస్తే.. ఎడమ వైపు వంగినట్లు కనిపించడం లేదూ.. కుడివైపుతో పోలిస్తే.. ఎడమవైపు 4 అడుగులు కిందకు ఉంటుంది. దీని వల్ల ఈ బార్లోకి వెళ్లినవారు నడుస్తున్నప్పుడు చిన్నపాటి భ్రాంతికి లోనవుతారు. 

1765లో ఈ భవంతిని నిర్మించారు. 1830లో ఇది బార్‌గా మారింది. ఇంతకీ ఇలా తూలడానికి కారణమేంటని అడిగితే.. స్థానికంగా జరిగిన మైనింగేనని అక్కడివారు చెబు తారు. దీని వల్ల అది ఓవైపు భూమిలోకి ఒరిగినట్లు అయిందట. స్థానిక అధికారులు వెంటనే స్పందించి.. తగు చర్యలు తీసుకోవడంతో పూర్తిగా ఒరిగిపోకుండా ఇలా మిగిలిపోయింది. అయితే.. ఇలా వాలిపోవడమే దానికి క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. తాగకుండానే తూలిపోయే అనుభూతిని పొందడానికి వివిధ దేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు.

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top