బోర్గా ఉందా.. అయితే మీరే జననేత | Boredom can make you politically radicalised | Sakshi
Sakshi News home page

బోర్గా ఉందా.. అయితే మీరే జననేత

Jul 8 2016 12:20 PM | Updated on Sep 17 2018 5:17 PM

బాగా విసుగు, చిరాకుతో ఉన్నారా.. అయితే మీరు పొలిటిషియన్ అయినట్లే. అవును ఇది నిజమే.. లండన్లోని ఓ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనకారులు ఇదే విషయాన్ని బల్లగుద్ది చెబుతున్నారు.

లండన్: బాగా విసుగు, చిరాకుతో ఉన్నారా.. అయితే మీరు పొలిటిషియన్ అయినట్లే. అవును ఇది నిజమే.. లండన్లోని ఓ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనకారులు ఇదే విషయాన్ని బల్లగుద్ది చెబుతున్నారు. విసుగు, చిరాకు అనేది ఒక వ్యక్తి ఆలోచనను చివరి అంచుకు తీసుకెళ్తుందని, ఆ సమయంలో అతడు తీసుకునే నిర్ణయాలు అత్యంత వ్యూహాత్మకంగా, రాజకీయంగా దూసుకెళ్లేందుకు పనికొస్తాయని అంటున్నారు.

లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ లైమెరిక్కు చెందిన కింగ్స్ కాలేజీకి చెందిన అధ్యయనకారులు ఈ అంశంపై ప్రత్యేక పరిశోధన నిర్వహించారు. ‘విసుగు ప్రజలను చివరి అంచుకు తీసుకెళుతుంది. అది వారిని సవాళ్లను స్వీకరించడానికి, త్వరపడటానికి ఉపయోగపడుతుంది. రాజకీయ వ్యూహాలన్ని కూడా ఆహ్వానించదగినట్లుగా ఉంటాయి’  అని ఈ వర్సిటీకి చెందిన డాక్టర్ విజ్నాడ్ వ్యాన్ టిల్బర్గ్ చెప్పారు. ఓటర్లను ప్రభావితం చేయగల స్థితి బోర్ గా ఫీలయ్యేవారిలో ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement